Advertisementt

పుష్ప 2 పై క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలిమ్యాన్

Fri 22nd Jul 2022 10:40 AM
manoj bajpayee,allu arjun,pushpa 2,sukumar  పుష్ప 2 పై క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలిమ్యాన్
Manoj Bajpayee reacts to playing a cop in Allu Arjun Pushpa 2 పుష్ప 2 పై క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలిమ్యాన్
Advertisement
Ads by CJ

పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఎనిమిది నెలలు గడిచిపోయాయి. కానీ ఇంతవరకు పార్ట్ 2 పట్టాలెక్కలేదు. ఆగస్టు నుండి పుష్ప ద రూల్ రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు కానీ క్లారిటీ లేదు. ఈలోపు ఈ సినిమా కోసం సుకుమార్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తున్నారని అంటున్నారు. మరోపక్క పుష్ప బాలీవుడ్ లో సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు పార్ట్ 2 కోసం బాలీవుడ్ నటులని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయబోతున్నారని, నార్త్ ఆడియన్స్ మెచ్చేలా పుష్ప పార్ట్ 2 ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు. అల్లు అర్జున్ కూల్ గా ముంబై, ఫ్యామిలీతో వెకేషన్స్ అంటూ తిరుగుతున్నాడు. మధ్యలో పుష్ప పార్ట్ 3 అంటూ ఫహద్ ఫాసిల్ ఓ అప్ డేట్ ఇచ్చేసరికి అల్లు అర్జున్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. 

అయితే పుష్ప ద రూల్ లో తమిళ నటుడు విజయ్ సేతుపతి భాగం కాబోతున్నాడని తమిళ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ విషయంపై పుష్ప టీం స్పందించలేదు, అలాగే రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ మనోజ్ బాజ్పాయ్ పుష్ప 2 లో నటించబోతున్నాడని, పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనోజ్ బాజ్పాయ్ కనిపిస్తారని, ఇప్పటికే సుకుమార్ మనోజ్ తో మాట్లాడి ఆయన కేరెక్టర్ ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేసారంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ ప్రచారం పై మనోజ్ బాజ్పాయ్ స్పందించాడు. ఇలాంటి అప్డేట్స్ ఎవరిస్తారు మీకు ? అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ సినిమాలో తను భాగం కావట్లేదు అనే విషయాన్ని స్పష్టం చేసాడు మనోజ్ బాజ్పాయ్.

Manoj Bajpayee reacts to playing a cop in Allu Arjun Pushpa 2:

Manoj Bajpayee to play a cop in Allu Arjun Pushpa 2? The Family Man actor REACTS

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ