దర్శకుడు విక్రమ్ కుమార్ - హీరో నాగ చైతన్య కలయికలో తెరకెక్కిన థాంక్యూ మూవీ ఈ రోజు శుక్రవారం రిలీజ్ అయ్యింది. గత రాత్రే యుఎస్ ప్రీమియర్స్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి కనిపించింది. దిల్ రాజు కూడా కొంతమంది సెలబ్రిటీస్ కి హైదరాబాద్ లో ప్రీమియర్ షో వేసి చూపించాడు. రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ లు హీరోయిన్స్ గా నటించిన థాంక్యూ మూవీ కి విక్రమ్ కుమార్ క్లాస్ టచ్ ఇచ్చారు. ఇక యుఎస్ ప్రీమియర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. థాంక్యూ మూవీ ఫస్టాఫ్ లో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి విక్రమ్ కుమార్ చాలా టైం తీసుకున్నాడని, పాత్రల పరిచయం, లవ్ ట్రాక్ అంటూ ఫస్ట్ హాఫ్ ని సరిపెట్టేశారని అంటున్నారు.
అలాగే సెకండ్ హాఫ్ మొత్తం కథని నాగ చైతన్య చుట్టూ నే తిప్పారని, కామెడీ చూసుకుంటే పెద్దగా ఫన్ జనరేట్ అవ్వలేదని, కథ, కథనం, అలాగే ఎమోషన్ పండకపోవడం, కమర్షియల్ అంశాలు లేకపోవడం, మైనస్ అని, నాగ చైతన్య పెరఫార్మెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సినిమా నిడివి, మెసేజ్ ఇవి థాంక్యూ కి ప్లస్ పాయింట్స్ అని, థాంక్యూ చూసినంతసేపు పాత సినిమాలు జ్ఞప్తికి వచ్చేలా ఉంది అని, విక్రమ్ కుమార్ డైరెక్షన్ ఇంప్రెస్స్ చెయ్యలేదు అని, నాగ చైతన్య మార్క్ సన్నివేశాలు అంతగా లేకపోవడం ఆయన ఫాన్స్ కి నిరాశే అని అంటున్నారు. దిల్ రాజు నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయంటూ ఓవర్సీస్ ప్రేక్షకుల టాక్ ఉంది.