నిన్న ఉపాసన బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరు ఉపాసనని కోడలి పిల్లా అని సంబోధిస్తూ బర్త్ డే విషెస్ చెప్పారు. రామ్ చరణ్ కూడా భార్య కి స్వీట్ గా, ప్రేమగా విష్ చేసాడు. అయితే ఉపాసన తాజాగా తన బర్త్ డే రోజున చరణ్ ఎలా సర్ ప్రైజ్ చేసాడో అనే విషయాన్ని రివీల్ చేసింది. అది ఆమెతో కేక్ కట్ చేయించిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే ఉప్సి అంటూ కేక్ మీద రాయించి క్యాండిల్స్ ఊదించి మరీ భార్య ఉపాసన తో ప్రేమగా కేక్ కట్ చేయిచాడు రామ్ చరణ్.
ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉపాసన హ్యాపీ గా రామ్ చరణ్ కి థాంక్స్ చెప్పింది. నిన్న రామ్ చరణ్, ఉపాసన, చిరు, సురేఖ ఉన్న పిక్ షేర్ చేసిన చరణ్, ఈ రోజు ఉపాసన చరణ్ తో ప్రేమగా ఉన్న పిక్స్ షేర్ చేసే సరికి మెగా ఫాన్స్ ఆనంద పడిపోతున్నారు. పదికాలాల పాటు మెగా వారసుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ఇంతే సంతోషంగా ఉండాలంటూ కోరుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం RC15 కొత్త షెడ్యూల్ లో జాయిన్ అవ్వబోతున్నారు. మరోపక్క విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ప్రాజెక్ట్ ఓకె చెయ్యబోతున్నారంటున్నారు.