నిన్నగాక మొన్న నెలన్నర యూరప్, అమెరికా ట్రిప్ లో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేసి ఈమధ్యనే హైదరాబాద్ కి వచ్చిన మహేష్ బాబు ఈ బుధవారం అన్న రమేష్ బాబు కొడుకు బర్త్ డే సెలెబ్రేషన్స్ ని ఘట్టమనేని ఫ్యామిలీతో గ్రాండ్ నిర్వహించిన మహేష్ బాబు గత రాత్రి అంటే గురువారం రాత్రి కూతురు 10 వ పుట్టినరోజు వేడుకలని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక త్రివిక్రమ్ తో మహేష్ చెయ్యబోయే SSMB28 మొదలు కావడానికి మరికాస్త టైం మహేష్ కి దొరికింది.
దానితో ఆయన మరోసారి వెకేషన్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ రోజు ఉదయమే భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ తో కలిసి లండన్ ట్రిప్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మహేష్ తన ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో కనిపించారు. దానితో ఆయన ఫాన్స్ మొన్ననే కదా మహేష్.. ట్రిప్ వేసావ్.. మళ్ళీ వెకేషన్ ఏంటి మహేష్.. ముందు SSMB28 పని చూడండి సర్ అంటున్నారు.