నయనతార కి పెళ్లి అచ్చిరాలేదు. అందుకే రెండు పెళ్లిళ్లు పీటల వరకు వచ్చి ఆగిపోయాయి. జూన్ 9 న విగ్నేష్ శివన్ ని పెళ్లాడిన మరుసటి రోజే తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులతో నడిచి టిటిడి ఆగ్రహానికి గురైంది. నయన్ - విగ్నేష్ లు చివరికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ పెళ్లి హక్కులని బడా ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కి అమ్మి సొమ్ము చేసుకుంటే.. పెళ్లి అయిన వెంటనే విగ్నేష్ శివన్ నయన్ తో బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి.. సదరు ఓటిటి సంస్థకి కోపం వచ్చి వారి డీల్ క్యాన్సిల్ చెయ్యడమే కాకుండా 25 కోట్ల నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తుంది అంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి.
ఇప్పుడు పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ నయనతార - విగ్నేష్ శివన్ ల పెళ్లి హక్కులని 200 కోట్లకి డీల్ చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ నయన్ - విగ్నేష్ ల ప్రీ వెడ్డింగ్ షూట్ రిలీజ్ చేసింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా నయన్ - విగ్నేష్ శివన్ ల పెళ్లి డాక్యుమెంటరీని త్వరలోనే ప్రసారం చెయ్యబోతున్నట్టుగా ప్రకటించింది. నయన్ - విగ్నేష్ ల ఫొటోస్ చూస్తుంటే ఒక అద్భుతంలా ఉన్నాయి. మెరిసే నక్షత్రాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ కి రానున్న నయన్ - విగ్నేష్ ల కోసం మేము డాన్స్ చేస్తున్నాం, అదొక అద్భుత కావ్యం అంటూ నెట్ ఫ్లిక్స్ సంస్థ వారి పెళ్లి డాక్యుమెంటరీపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసింది. దానితో నయన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.