బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తున్నారు. రీసెంట్ గా బాలయ్య బర్త్ డే కి NBK107 నుండి టీజర్ రిలీజ్ చేసారు. బాలయ్య మాస్ లుక్, పవర్ ఫుల్ డైలాగ్స్ అన్ని ఫాన్స్ ని ఊపేసాయి. బాలయ్య మాస్ లుక్ తో ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం NBK107 టీం విదేశాల్లో షూటింగ్ చెయ్యడానికి రెడీ అవుతుంది. ఈమధ్యనే కరోనా బారిన పడిన బాలయ్య కోలుకుని సినిమా షూటింగ్స్ కి హాజరవుతున్నారు.
తాజాగా బాలయ్య నటిస్తున్న NBK107 నుండి ఓ లుక్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెల్ల ప్యాంటు, చొక్కాలో ఉన్న బాలయ్య షర్ట్ బటన్స్ తీసేసి.. బనియన్ కనిపిస్తుండగా, చేతిలో ఏదో గ్లాస్ ఉండగా తీసిన పిక్ అది. ఆ లుక్ బాలయ్య రెండో కేరెక్టర్ కి సంబందించిన లుక్. ఇక ఈ షెడ్యూల్ మరో మూడు రోజుల పాటు యాగంటి, కర్నూల్, ఓర్వకల్లు, పంచలింగాల ప్రాంతాల్లో జరుగుతుంది అని తెలుస్తుంది. తదుపరి షెడ్యూల్ అమెరికా లో కాకుండా టర్కీలో ప్లాన్ చేసారని అంటున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ బాలయ్య సరసన నటిస్తుంది.