రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజా సంచలనం ‘లైగర్’ ట్రైలర్‌ని గ్రాండ్‌గా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అల్లరి చిల్లరిగా తిరిగే ఓ కుర్రాడు.. అంతర్జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎలా మారాడు? అనేదే ఈ చిత్ర కథగా ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ట్రైలర్‌లో కొన్ని సన్నివేశాలు అబ్బుర పరుస్తుంటే.. మరికొన్ని సన్నివేశాలు పూరి గత సినిమాల్లో చూసినట్లే అనిపిస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ ‘చిరుత’ సినిమా లక్షణాలు చాలా వరకు ఇందులో కనబడుతున్నాయి. అలాగే ఈ ట్రైలర్ చూశాక కొందరు నెటిజన్లు.. ఇది ట్రైలర్‌లా లేదని.. రెండో సాంగ్‌కి సంబంధించిన గ్లింప్స్‌లా అనిపిస్తుందని కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. అయితే అన్నిటికంటే కూడా ఈ ట్రైలర్‌లో బాగా హైలెట్ అవుతున్నది మాత్రం రమ్యకృష్ణ రోల్. విజయ్ దేవరకొండ తల్లిగా ఇందులో రమ్యకృష్ణ ఊర మాస్ అవతారంలో నటించింది.
ట్రైలర్‌ని రమ్యకృష్ణ డైలాగ్‌తోనే మొదలెట్టారు. విజయ్ దేవరకొండ విషయంలో ఈ ట్రైలర్ రొటీన్ అని అనిపిస్తున్నా.. రమ్యకృష్ణ పాత్ర వరకు మాత్రం ఈ సినిమా హైలెట్ కాబోతోంది అనేలా ట్రైలర్ అయితే చెప్పేస్తుంది. ఆమె పాత్ర తీరుతెన్నులు.. ఖచ్చితంగా ఈ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా విజయ్ దేవరకొండను లాగిపెట్టి తన్నే సీన్.. ఈ ట్రైలర్‌కే హైలెట్. ‘బాహుబలి’లో శివగామి పాత్ర తర్వాత రమ్యకృష్ణ చాలా సినిమాలు చేసింది కానీ.. ఆ స్థాయిలో అయితే పేరు రాలేదు. మళ్లీ ఈ చిత్రంతో రమ్యకృష్ణ పేరు మారుమ్రోగడం ఖాయం. ఈ సినిమా తర్వాత రమ్య.. బాలీవుడ్‌లోనూ బిజీ తారగా మారిపోతుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మొత్తంగా చూస్తే మాత్రం.. ట్రైలర్ కాస్త రొటీన్‌గా అనిపించినా.. ఇందులో ఉన్న కంటెంట్ వైజ్‌గా మాత్రం పూరి మార్క్ పర్ఫెక్ట్‌గా కనబడుతుంది. తెలుసుగా.. పూరి మార్క్ వర్కవుట్ అయితే.. బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సౌండ్ వస్తుందో?. ఈ సినిమా విషయంలో అది మరోసారి వర్కవుట్ అయ్యే లక్షణాలు అయితే గట్టిగానే కనబడుతున్నాయి. చూద్దాం.. ఆగస్ట్ 25న ఏం జరగబోతోందో?