యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ బాబుని చూపించిన తీరుకు ఆయన ఎంతో మురిసిపోయారు. ఆ తర్వాత సూపర్ స్టార్‌కి యంగ్ దర్శకులపై నమ్మకం ఏర్పడి.. వెంటనే పరశురామ్‌తో సినిమాకి అంగీకరించారు. ఆ సినిమా కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యమైనప్పటికీ, ఎలాగోలా పూర్తి చేసి థియేటర్స్‌లో వదిలారు. సినిమా రిజల్ట్ విషయంలో నార్మల్ హిట్ దగ్గరే సినిమా నిలబడిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు పరశురామ్ చేసే తదుపరి చిత్రం ఏమిటనేది ఇంత వరకు ప్రకటన రాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోని డైరెక్ట్ చేసిన తర్వాత.. అతనికి వరుసగా ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. కానీ, ఆయన ఊహించింది అస్సలు జరగలేదు. ఈ సినిమా సమయంలో జరిగిన ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రం నాగచైతన్యతో ఉంటుందని పరశురామ్ వెల్లడించారు. కానీ నాగచైతన్య తన తాజా ఇంటర్వ్యూలో చెప్పిన దానిని బట్టి చూస్తే.. ఇప్పుడప్పుడే పరశురామ్‌తో సినిమా ఉండే అవకాశం అయితే కనబడటం లేదు.
తనతో సినిమా అని చెప్పి, మధ్యలో మహేష్‌తో అవకాశం రాగానే వెళ్లిపోయాడని పరశురామ్‌పై చైతూ ఏమైనా అలిగాడేమో.. తెలియదు కానీ.. తన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’కి సంబంధించి జరిగిన ఇంటర్వ్యూలో.. పరశురామ్‌తో సినిమా స్ర్కిప్ట్ ఇంకా ఓకే కాలేదని చెప్పేశాడు. ఒక పాయింట్ అనుకున్నాం కానీ.. ఫైనల్ మాత్రం కాలేదు.. అని చెప్పుకొచ్చాడు. దీంతో పరశురామ్ తదుపరి ప్రాజెక్ట్‌పై మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు చైతూ-పరశురామ్ ప్రాజెక్ట్ ఉంటుందా అనేలా? కామెంట్స్.. ఒక వేళ ఉన్నా.. చైతూకి ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ఇంకా సంవత్సరమైనా ఈ ప్రాజెక్ట్‌కి పడుతుందనేలా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సో.. ఎలా చూసినా.. ఇంకా సంవత్సరం పాటు దర్శకుడు పరశురామ్ ఖాళీనే. ఒక వేళ చైతూ చేయనని చెప్పినా.. మరో హీరో, అవకాశం కోసం ఈజీగా పరశురామ్‌కి వన్ ఇయర్, అంతకంటే ఎక్కువ సమయం పట్టడం పక్కా. మహేష్ బాబు వంటి హీరోతో సినిమా చేసిన తర్వాత కూడా పరశురామ్ గురించి ఇటువంటి వార్తలు రావడం.. అతని కెరీర్‌కి అయితే అంత మంచిది కాదనే చెప్పుకోవాలి.