మెగాస్టార్ ఇంటి కోడలిగా అడుగుపెట్టిన కామినేని వారసురాలు ఉపాసన.. పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీ లో ఇట్టే కలిసిపోయింది. అటు పుట్టింటి గౌరవం, ఇటు మెట్టినింటి గౌరవాన్ని కాపాడుతూ రామ్ చరణ్ భార్య గా ఉపాసన పేరు తెచ్చుకుంది. ఆ ఇంట్లో ఎలాంటి ఫ్యామిలీ ఈవెంట్ జరిగినా రామ్ చరణ్ తో కలిసి ఉపాసన ఆ పార్టీ ని ఆరెంజ్ చేస్తుంది. అత్తగారు సురేఖ తో కలిసి పూజలు చేస్తుంది. ఇక రామ్ చరణ్ కలిసి ఈ మధ్యనే వెడ్డింగ్ యానివెర్సరీని విదేశాల్లో జరుపుకున్న ఉపాసన నేడు తన పుట్టిన రోజుని సెలెబ్రేట్ చేసుకుంది.
మామగారు చిరంజీవి కోడలు ఉపాసనకు ప్రేమగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మా ఇంటి కోడలు పిల్ల @upasanakonidela కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 💐🥰 అంటూ విష్ చెయ్యగా.. భర్త రామ్ చరణ్ ఓ లవ్లీ పిక్ ని షేర్ చేస్తూ.. To my Dearest @upasanakonidela Happiest Birthday ❤️ అని ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.