గత రెండు రోజులుగా నిత్యా మీనన్ పెళ్ళంట, వరుడు ఎవరంటే.. అంటూ రకరకాల వార్తలు ఇంటర్నెట్ లో హడావిడి చేస్తున్నాయి. కొన్నాళ్లుగా సినిమాల విషయంలో సైలెంట్ గా ఉన్న నిత్యా మీనన్ ఈమధ్యనే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లో బరువైన పాత్ర చేసింది. పవన్ కళ్యాణ్ భార్యగా కనిపించి ఆకట్టుకుంది. తర్వాత మోడరన్ లవ్ వెబ్ సిరీస్ లో నటించింది. నటనకు అవకాశం ఉన్న పాత్రలు వస్తే.. నిత్యా మీనన్ అస్సలు వదులుకోదు. కానీ ఆమె బరువు ఆమెకి అవకాశాలను దూరం చేసింది. అయితే ఈ మధ్యన నిత్యా మీనన్ డైరెక్షన్ మీద కూడా దృష్టి పెట్టింది అన్నారు.
ఇంతలోపులో నిత్య పెళ్లి పీటలెక్కుతుంది అంటూ ప్రచారం షురూ అయ్యింది. తాజాగా నిత్యా మీనన్ తన పెళ్లి పై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పుకార్లే అని తేల్చేసింది. దీనితో నిత్యా మీనన్ పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లే. ఇక నిత్యా మీనన్ - విజయ్ సేతుపతి కలయికలో తెరకెక్కిన మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.