ఒకప్పుడు సమంత తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన హీరో సిద్దార్థ్ కి గతంలోనే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారనే ప్రచారం జరిగింది. సమంత తో బ్రేకప్ అయ్యాక సిద్దార్థ్ సైలెంట్ గా సినిమాలు చేసుకుంటున్నా అతనికి సక్సెస్ దక్కడం లేదు. చాలా ఏళ్ళకి మహాసముద్రంతో సిద్దార్థ్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా డిసాస్టర్ గా నిలిచింది. తర్వాత వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దార్థ్ బిజెపి పార్టీ నాయకులపై ఒంటి కాలు పై లేస్తుంటాడు. అయితే ఇప్పుడు సిద్దార్థ్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఎందుకంటే సిద్దార్థ్ ఈమధ్యన మహాసముద్రం హీరోయిన్ అధితి రావు తో ప్రేమలో పడడమే కాకుండా ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. తాజాగా సిద్దార్థ్ అధితి రావు ఇద్దరూ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతుండగా ఫోటో గ్రాఫర్స్ ఈ జంటని ఫొటోస్ తియ్యడానికి ప్రయత్నించగా సిద్దార్థ్ అసహనం వ్యక్తం చెయ్యడమే కాకుండా, నేను ఇక్కడివాడిని కాదు, ఇక్కడి వాళ్ళని ఫొటోస్ తీసుకోండి, ఇప్పుడు సాఫ్ట్ గా చెబుతున్నా తర్వాత విషయం వేరేలా ఉంటుంది అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం చూసిన నెటిజెన్స్ మీరు తిరిగినప్పుడు లేదు కానీ, ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీస్తే వచ్చిందా అంటూ సిద్దార్థ్ పై కామెంట్స్ చేస్తున్నారు.