సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సమంతానే. సమంత కాఫీ విత్ కరణ్ షో లో అక్షయ కుమార్ తో చేసిన డాన్స్ క్లిప్స్ క్లిప్స్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రస్తుతం ఆమె గ్లామర్ షో వేరే లెవల్ అన్న రేంజ్ లో ఉంది. బాలీవుడ్ ఆఫర్స్ కోసం విపరీతమైన హాట్ షో చేస్తున్న సమంత.. ఇప్పుడు Thalapathy67 మూవీ విషయంలో ట్రెండింగ్ లోకి వచ్చింది. విజయ్ తో హిట్ సినిమాల్లో నటించిన సమంత ఈసారి తనలోని మరోకోణాన్ని చూపించబోతుందట.
ఫ్యామిలీ మ్యాన్ లో LTT తీవ్రవాదిలా నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ పాత్రలో చెలరేగిపోయిన సమంత లోకేష్ కనగరాజ్-విజయ్ కలయికలో తెరకెక్కబోయే Thalapathy 67 లో విలన్ పాత్ర అంటే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే గనక నిజమైతే ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు, హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేసిన సమంత బిగ్ స్క్రీన్ మీద నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చెయ్యడం ఇదే మొదటిసారి అవుతుంది.