Advertisementt

అల్లు అర్జున్ ఏంటి అలా అనేశాడు

Wed 20th Jul 2022 11:57 AM
icon star allu arjun,hindi film,pushpa,sanjay leela bhansali  అల్లు అర్జున్ ఏంటి అలా అనేశాడు
Allu Arjun Interesting comments on Bollywood straight movie అల్లు అర్జున్ ఏంటి అలా అనేశాడు
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ఈమధ్యన పుష్ప 2 షూటింగ్ విషయాలను పక్కనబెట్టి ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్లడం, మధ్యమధ్యలో ముంబై లో తేలడం చేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ బాలీవుడ్ స్ట్రయిట్ మూవీకి సన్నాహాలు చేసుకుంటున్నాడు, అందుకే తరచూ ముంబై ఫ్లైట్ ఎక్కుతున్నాడంటూ మీడియాలో ప్రచారం మొదలైంది. అందులోను ప్రత్యేకంగా అల్లు అర్జున్ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో మీటింగ్స్ పెట్టడంతో పుష్ప తదుపరి అల్లు అర్జున్ ప్రోజెక్ట్ సంజయ్ లీలా బన్సాలీతో ఉండబోతుంది అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. 

అందులో భాగంగానే అల్లు అర్జున్ దసరా ఫెస్టివల్ సందర్భంగా తన బాలీవుడ్ ప్రాజెక్ట్ ని ప్రకటించబోతున్నాడని ప్రచారం షురూ అయ్యింది. కానీ అల్లు అర్జున్ మాత్రం తనకి తెలుగు సినిమాలు సంతృప్తినిస్తున్నాయని, తనకు బాలీవుడ్ మూవీ ఛాన్స్ వచ్చి, మంచి డైరెక్టర్, మంచి స్క్రిప్ట్ లభిస్తే బాలీవుడ్ స్ట్రయిట్ మూవీ తప్పకుండా చేస్తాను అని చెప్పడమే కాదు.. ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం మంచి సినిమాలు చేయాలనేదే తన కోరిక అంటూ తేల్చేసారు. మరి పుష్ప సినిమాతో నార్త్ ఆడియన్స్ హృదయాలను దోచేసిన అల్లు అర్జున్.. ఆ క్రేజ్ ని బాలీవుడ్ స్ట్రయిట్ మూవీకి వాడుకోవాలనుకున్నాడంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కామెంట్స్ తో అది తుస్ మంది. 

Allu Arjun Interesting comments on Bollywood straight movie:

Icon Star Allu Arjun Wants To Do Straight Hindi Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ