Advertisementt

ముగ్గురు హీరోయిన్స్ కి హిట్ ఎంతో అవసరం

Wed 20th Jul 2022 11:44 AM
naga chaitanya,thank you,raashi khanna,avika gor,malavika nair  ముగ్గురు హీరోయిన్స్ కి హిట్ ఎంతో అవసరం
All three heroines need a hit ముగ్గురు హీరోయిన్స్ కి హిట్ ఎంతో అవసరం
Advertisement
Ads by CJ

రేపు శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్న నాగ చైతన్య థాంక్యూ మూవీ పై మంచి అంచనాలున్నాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య ఇంతకుముందే మనం వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు థాంక్యుపై అందరిలో అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోయిన్స్ లో రాశి ఖన్నా మెయిన్ కేరెక్టర్ లో కనిపిస్తుండగా, అవికా గోర్, మాళవిక నాయర్ లు హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ ముగ్గురు హీరోయిన్స్ కి థాంక్యూ హిట్ ఎంతో అవసరం. అవికా గోర్ స్లిమ్ గా తయారయ్యాక గ్లామర్ షో చేస్తుంది. అయినా అమ్మడుకి హిట్ తగలడం లేదు.

ఈ సినిమాలో చైతు కి రాఖి కట్టి అన్నయ్య అనేసింది. మరి అవిక కేరెక్టర్ పై కాస్త సస్పెన్స్ గానే ఉంది. మరో హరోయిన్ మాళవిక నాయర్ కి హిట్ కంపల్సరీ. ఆమె కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్నే. నాగ చైతన్య 16 ఇయర్ బాయ్ గా ఉన్నప్పుడు మాళవిక ని లవ్ చేసినట్టుగా ట్రైలర్ లో చూపించారు. మరి ఆమె కేరెక్టర్ నిడివి ఎంతుందో అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. ఇక ముఖ్యంగా రాశి ఖన్నా. ఆమెకి పక్కా కమర్షియల్ లాంటి పక్కా డిజాస్టర్ మూవీ తగిలింది. ఆ సినిమా తర్వాత ఆమె హోప్స్ అన్ని థాంక్యూ మీదే పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అవ్వకపోతే రాశి ఖన్నా టాలీవుడ్ కెరీర్ ఖేల్ ఖతం. సో ఆమెకి హిట్ అత్యవసరమే. మరి థాంక్యూ మూవీ హిట్ అయితే ముగ్గురు హీరోయిన్స్ కెరీర్ సేఫ్. లేదంటే కష్టమే సుమీ..

All three heroines need a hit:

Three heroines for Naga Chaitanya Thank You

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ