Advertisementt

ఆ డైరెక్టర్ తో పని చేయాలనుంది: జాన్వీ కపూర్

Wed 20th Jul 2022 11:19 AM
janhvi kapoor,south directors,vetrimaran,alphonse  ఆ డైరెక్టర్ తో పని చేయాలనుంది: జాన్వీ కపూర్
Janhvi kapoor likes to act in Vetrimaran ఆ డైరెక్టర్ తో పని చేయాలనుంది: జాన్వీ కపూర్
Advertisement
Ads by CJ

శ్రీదేవి కూతురు అనే టాగ్ నుండి బయటికి రావడానికి జాన్వీ కపూర్ చాలా ప్రయత్నాలే చేస్తుంది. సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతున్న జాన్వీ కపూర్ వెండితెర మీద ఇంకా సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం జాన్వీ కపూర్ తమిళనాట నయనతారకి హిట్ ఇచ్చిన కోలమావు కోకిల ని హిందీలో రీమేక్ చేస్తుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కాస్త డిఫరెంట్ గా కనిపించబోతుంది. అంటే డీ గ్లామర్ పాత్రలో అన్నమాట. తాజాగా జాన్వికపూర్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది,.

తనకి సౌత్ సినిమాల్లో నటించాలనే కోరిక చాలాకాలంగా ఉంది అని.. అంతేకాకుండా మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుత్రన్‌ సినిమాలంటే తనకి చాలా ఇష్టం అని చెప్పిన జాన్వీ కపూర్.. తమిళంలో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఉంది అని చెబుతుంది. మరి జాన్వీ కపూర్ వెట్రి మారన్ డైరెక్షన్ లో నటించాలని ఉంది అంటే.. ఎన్టీఆర్ తో వెంట్రి మారన్ సినిమా చేసే అవకాశం ఉంది అంటూ వార్తలొస్తున్న వేళ జాన్వీ కపూర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అంటే ఎన్టీఆర్ తో జాన్వీ సౌత్ కి ఎంట్రీ ఇస్తే బావుంటుంది అని ఎన్టీఆర్ ఫాన్స్ కి ఎప్పటినుండో కోరిక ఉంది. అది ఇలా తీరినా తీరొచ్చు కదా.

Janhvi kapoor likes to act in Vetrimaran:

Janhvi kapoor likes to act in Vetrimaran, Alphonse direction

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ