Advertisementt

రవితేజ లో చేంజ్ గమనించారా..

Tue 19th Jul 2022 07:32 PM
ravi teja,remuneration issue,ramarao on duty,khiladi  రవితేజ లో చేంజ్ గమనించారా..
Ravi Teja Gives Clarity On Remuneration Rumours: రవితేజ లో చేంజ్ గమనించారా..
Advertisement
Ads by CJ

ఈమధ్యన ఏ హీరోపై రాని నెగెటివిటి రూమర్స్ రవితేజ మీద వచ్చాయి. ఎందుకంటే క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఖిలాడీ విషయంలో దర్శకనిర్మాతలు ముప్పుతిప్పలు పెట్టడంతో.. అప్పట్లో రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. ఖిలాడీ సినిమా టైం లో ఆయన డబ్బింగ్ కి రాకుండా, ప్రమోషన్స్ కి రాకుండా పారితోషకం విషయంలో మంకుపట్టు పట్టాడంటూ ప్రచారం జరిగింది. ఆఖరికి రామారావు ఆన్ డ్యూటీ విషయంలో అదే న్యూస్ లు హైలెట్ అయ్యాయి. రామారావు ఆన్ డ్యూటీ మేకర్స్ ని కూడా రవితేజ ప్రమోషన్స్ కి రాకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడని, పారితోషకం విషయంలోనూ రవితేజ చేస్తున్న డిమాండ్స్ వలనే సినిమా పలుమార్లు వాయిదా కూడా పడింది అన్నారు. 

తాజాగా ఈ రూమర్స్ కి చెక్ పెట్టాడు రవితేజ. రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్న రవితేజ.. ఇప్పుడు ఆ సినిమా ఇంటర్వ్యూలో సందడి చేస్తున్నాడు. తాజాగా తనపై వస్తున్న రూమర్స్ గురించి మట్లాడుతూ.. గాసిప్స్ వస్తూనే ఉంటాయి. నేను వాటిని అస్సలు పట్టించుకోను, పనీపాటా లేని వాళ్ళు రాసే రాతలకు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కానీ అలాంటి రూమర్స్ చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు లేకపోతే బోర్ కొడుతోంది. రామారావు ఆన్ డ్యూటీకి నేనూ ఒక నిర్మాతనే. అలాంటప్పుడు రెమ్యునరేషన్ గురించి నేనేందుకు గొడవపడతాను. ఇంకో నిర్మాత సుధాకర్ చాలా మంచి వాడు, అలాంటి మంచి నిర్మాత ఉంటే సినిమాలకి సమస్యలు ఎందుకొస్తాయి అంటూ రవితేజ తేల్చేసినా.. ఆయన ఖిలాడీ విషయంలో చేసిన తప్పిదాలను మాత్రం ఎత్తి చూపుతూనే ఉన్నారు నెటిజెన్స్.

Ravi Teja Gives Clarity On Remuneration Rumours::

Ravi Teja Clarity About Remuneration issue with RamaRao on Duty

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ