రష్మిక మందన్న.. ఇప్పుడు స్టార్ హీరోలకి లక్కీ హీరోయిన్. అందుకే పలు భాషల హీరోలు రష్మిక కోసం వెయిట్ చేస్తున్నారు. మరి రశ్మికకి ఇంతటి ఫేమ్ రావడానికి కారణం ఆమె ప్రేమని, ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకోవడమేనట. ఈ మాటన్నది ఎవరో కాదు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. రష్మిక కెరీర్ స్టార్టింగ్ లోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడి నిశ్చితార్ధం కూడా చేసుకుంది, పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో రష్మిక కెరీర్ కోసమే ఆ నిశ్చితార్ధాన్ని బ్రేక్ చేసుకుంది అన్నారు. ఇప్పుడు అది నిజమే.. రష్మిక - రక్షిత్ శెట్టి జాతకాలు కలవలేదు. అందు వలనే నేను రష్మిక తో చెప్పాను. ఈ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకోమని, అప్పుడే మీకు, రక్షిత్ కి కూడా బావుంటుంది అని చెప్పాను.
దానితో రష్మిక నేను రక్షిత్ మాట్లాడుకుని స్నేహపూర్వకంగా విడిపోతామని చెప్పింది. అంతేకాకుండా రష్మిక తన ఇంట్లోనే నాతో పూజలు చేయించుకుంది అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసాడు. రష్మిక ఇంట్లో చేసిన పూజ వలనే ఆమె కెరీర్ పరుగులు పెడుతుంది అని, ఆమె కి చేతినిండా సినిమాలు ఉండడానికి కారణం తాను చేసిన పూజే అంటూ వేణు స్వామి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి వేణు స్వామి కొంతకాలంగా సినిమా వాళ్ళ జాతకాల విషయంలో సంచలన కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.