సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యన యూరప్, అమెరికా ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ లో అడుగుపెట్టారు. భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతమ్ లతో లాంగ్ ట్రిప్ కి వెళ్లిన మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ తో చెయ్యబోయే SSMB28 కోసం రెడీ అవుతున్నారు. ఆగస్టు నుండి SSMB28 రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. అయితే తాజాగా మహేష్ భార్య నమ్రత కొన్ని ఫ్యామిలీ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ బర్త్ డే ని కృష్ణ ఫ్యామిలీ అదిరిపోయేలా సెలబ్రేట్ చేసింది.
దానికి సంబందించిన సెల్ఫీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నమ్రత శిరోద్కర్ తీసిన పిక్స్ లో మహేష్ బాబు సోదరీమణులు మంజుల, ఆమె భర్త, ఇంకా సుధీర్ బాబు, ఆయన వైఫ్, గౌతమ్, సితార, మంజుల కూతురు ఉన్నారు. అలాగే గల్లా జయదేవ్ కొడుకు హీరో అశోక్ కూడా ఈ సెల్ఫీ లో మెరిశాడు. అంతలోపులోనే మహేష్ బాబు తన ఇన్స్టా స్టోరీస్ లో అదిరిపోయే సెల్ఫీ ని పోస్ట్ చేసారు. మహేష్ బాబు స్వయంగా ఆ సెల్ఫీ తియ్యగా అందులో కృష్ణ గారి ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఉన్నారు. అలా జయకృష్ణ బర్త్ డే వేడుకలను ఘట్టమనేని ఫ్యామిలీ మెంబెర్స్ అద్భుతంగా సెలెబ్రేట్ చేసుకున్నారన్నమాట.