లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న జోరు మాములుగా లేదు. గ్లామర్ షో లతో సినిమా ఆఫర్స్ పట్టేస్తున్న రష్మిక తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో సినిమాల మీద సినిమాలు చేస్తుంది. పుష్ప 2 పాన్ ఇండియా మూవీ తో పాటుగా, మలయాళంలో సీత రామమ్ లో నటిస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన వారసుడు మూవీ చేస్తున్న రష్మిక బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా, అమితాబ్, రణబీర్ కపూర్ మూవీస్ లో నటిస్తుంది. నిమిషం తీరిక లేని రశ్మికకి మరో కోలీవుడ్ ఆఫర్ తగిలినట్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
పా రంజిత్ - విక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ కోసం మేకర్స్ రష్మిక మందన్నాని సంప్రదిస్తున్నారనే న్యూస్ నడుస్తుంది. స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కే ఈ.జ్ఞానవేల్ రాజా నీలం ప్రొడక్షన్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. దీని కోసమే రశ్మికని సంప్రదించగా.. రష్మిక కూడా విక్రమ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అంటున్నారు. మరి నిజంగా రశ్మికకి ఈ ఛాన్స్ తగిలితే కోలీవుడ్ లో రష్మిక హావా కి తిరుగుండదు.