నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన థాంక్యూ ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. రాశి ఖన్నా- నాగ చైతన్య కాంబో ఇంటర్వూస్, చైతు సోలో ఇంటర్వూస్, దర్శకుడు విక్రమ్ ఇంటర్వూస్, దిల్ రాజు ఇంటర్వూస్ అంటూ ప్రమోషన్స్ మోత మోగించేస్తున్నారు. తాజాగా నాగ చైతన్య థాంక్యూ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా విషయాలను, నేపథ్యం ని రివీల్ చేసాడు. వెంకట్ ప్రభుతో తెలుగు, తమిళ్ లో తెరకెక్కబోయే మూవీ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నేను చేస్తోన్న సినిమాలో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. నా స్టైల్లో సాగే మాస్ కమర్షియల్ మూవీ అది. సెన్సిబుల్ ఇంటెలిజెంట్ మూవీ అని చెప్పాడు. ఈమధ్యనే వెంకట్ ప్రభు-నాగ చైతన్య మూవీపై అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే,
కంటెంట్ వుంటే ధియేటర్ కు వస్తారు అంటూ నాగ చైతన్య ఈ ఇంటర్వ్యూలో సంచలనంగా మాట్లాడాడు. ప్రస్తుతం తాను యూత్ కాదని, అఖిల్ యూత్ అని, నా ఏజ్ వాళ్ళలో నేను యూత్. థాంక్యూ సినిమాలో 16 ఇయర్స్ బోయ్ లాగా కనిపించాను, 16 ఇయర్స్ బాయ్ లా కనిపించడం ఇదే లాస్ట్. మరోసారి ఇలాంటి క్యారెక్టర్ రాదు. ధ్యాక్వూ వల్ల చాలామందికి దగ్గర అయ్యాను.. అందరితో మాట్లాడుతున్నా, సినిమా లో రాశి ఖన్నా వల్ల నా లైప్ టర్న్ అవుతుంది.. అంటూ థాంక్యూ సినిమా లోని ఆసక్తికర విషయాలను చైతు రివీల్ చేసాడు.