Advertisementt

పుష్ప 2 లోకి ఫ్యామిలీ మ్యాన్

Mon 18th Jul 2022 10:09 PM
manoj bajpai,allu arjun,pushpa 2,sukumar  పుష్ప 2 లోకి ఫ్యామిలీ మ్యాన్
Manoj Bajpai to play police officer in Pushpa 2 పుష్ప 2 లోకి ఫ్యామిలీ మ్యాన్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ లు పుష్ప 2 షూటింగ్ ని ఆగష్టు నుండి మొదలు పెట్టబోతున్నారు. పుష్ప ద రైజ్ హిట్ అవడంతో పుష్ప ద రూల్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగా సుకుమార్ కూడా పుష్ప ద రూల్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా కోసం సుకుమార్ ఈసారి నటుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతిని ఎంపిక చేశారనే న్యూస్ నడుస్తుండగానే.. ఇప్పుడు పుష్ప కోసం ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఫ్యామిలీ మ్యాన్ ని తీసుకున్నారట. 

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో విపరీతమైన పాపులారిటి సంపాదించిన మనోజ్ బాజ్ పాయ్ ని పుష్ప లో ఓ పోలీస్ అధికారి పాత్రకి ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. మనోజ్ బాజ్ పాయ్ చెయ్యబోయే పాత్రను సుకుమార్ డిజైన్ చేసిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. సుకుమార్ బాలీవుడ్ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చెయ్యడానికి అక్కడి నటులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. ఇక అల్లు అర్జున్ గతంలోనే మనోజ్ బాజ్ పాయ్ తో నటించాడు. అల్లు అర్జున్ - మనోజ్ బాజ్ పాయ్ కలిసి హ్యాపీ సినిమాలో చేశారు. మళ్ళీ ఇప్పుడు పుష్ప ద రూల్ కోసం కలుస్తున్నారు.

Manoj Bajpai to play police officer in Pushpa 2:

Manoj Bajpai to play police officer in Allu Arjun Pushpa 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ