హార్ట్ ఎటాక్ సినిమా తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆదః శర్మ.. తర్వాత అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినా అమ్మడుకి ఫేమ్ రాకపోగా.. అవకాశాలు మరింతగా సన్నగిల్లాయి. తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ హడావిడి చేస్తున్న ఆమె అందాలు ఆరబొయ్యడంలో చాలా డిఫ్రెంట్ గా ఆలోచిస్తుంది. వెరైటీ వెరైటీ డ్రెస్సులతో, వర్కౌట్స్ తోనూ ఆదః శర్మ గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె అందాలు చూసి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు, సినిమా అవకాశాలు ఇవ్వడం లేదు.
తాజాగా రకరకాల ఆకులతో చేసిన డ్రెస్ తో అదిరిపోయే ఫోజులిచ్చింది, మనీ ప్లాంట్ ఆకులు, ఇంకొన్ని వేరే రకమయిన క్రోటన్స్ ఆకులతో చేసిన డ్రెస్ ని వేసుకుని Nature - my fashion inspiration అంటూ క్యాప్షన్ పెట్టి ఆ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆదః శర్మ ప్రకృతి ని ఎంతగా ఆస్వాదిస్తుందో, అదే ప్రకృతిని ప్రేమిస్తుంది. అనడానికి ఈ పిక్ బెస్ట్ ఎగ్జామ్ ఫుల్ గా చెప్పొచ్చు.