Advertisementt

అప్పుడు రష్మిక ఇప్పుడు ప్రకాష్ రాజ్

Mon 18th Jul 2022 06:48 PM
prakash raj,sarileru neekevvaru movie,major movie  అప్పుడు రష్మిక ఇప్పుడు ప్రకాష్ రాజ్
Prakash Raj About His Character Sarileru Neekevvaru Movie అప్పుడు రష్మిక ఇప్పుడు ప్రకాష్ రాజ్
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా మహేష్ ఫాన్స్ కి నచ్చినా.. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన కామెడిని ఎవ్వరూ పెద్దగా యాక్సప్ట్ చేయలేకపోయారు. సంగీత, రష్మిక, హరితేజ లు చేసిన కామెడీ వెగటు పుట్టించింది. అంతేకాకుండా రష్మిక మాట్లాడితే మహేష్ బాబు మీద పడిపోవడం కూడా ఎవరికీ నచ్చలేదు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక రష్మిక నెటిజెన్స్ కామెంట్స్ కి రియలైజ్ అయ్యినట్లుగా కనిపించింది. మళ్లీ ఇలాంటి కేరెక్టర్స్ ఒప్పుకోను అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. 

అదే సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో రాజకీయనాయకుడిగా ప్రకాష్ రాజ్ కనిపించారు. తాజాగా ఆయన కూడా అబద్ధాలాడే రాజకీయనాయకుడి పాత్రను అయిష్టంగానే చేశాను.. కొన్నిసార్లు మన నిర్ణయాలతో, అభిప్రాయాలతో పనిలేకుండా కొన్ని కొన్ని అలా జరిగిపోతుంటాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మహేష్ సినిమాలో అలాంటి అసంతృప్తి కేరెక్టర్ చేసినా మహేష్ ప్రొడ్యూస్ చేసిన మేజర్ లో అడివి శేష్ తండ్రిగా చేసిన పాత్ర మాత్రం నాకు చాలా సంతృప్తినిచ్చింది అంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Prakash Raj About His Character Sarileru Neekevvaru Movie:

Prakash Raj Sensational Comments On Mahesh Babu Sarileru Neekevvaru Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ