Advertisementt

30 కోట్లు లాభం రావాల్సిన సినిమా: దిల్‌రాజు

Mon 18th Jul 2022 06:16 PM
dil raju,dil raju interview,dil raju interview about thank you movie,thank you movie  30  కోట్లు లాభం రావాల్సిన సినిమా: దిల్‌రాజు
Dil Raju Interview 30 కోట్లు లాభం రావాల్సిన సినిమా: దిల్‌రాజు
Advertisement
Ads by CJ

జూలై 22న థాంక్యూ సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియాతో సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూ విశేషాలు..

- నేను ఇప్పటిదాకా  చేసిన సినిమాలను నా లైఫ్ తో పోల్చుకోలేదు. ఇప్పుడు థాంక్యూని పోల్చుకున్నాను. 

- రైటర్‌ రవి నాలుగేళ్ల క్రితం ఈ స్టోరీని నెరేట్‌ చేశారు. నాకు అందులో పాయింట్‌ బాగా నచ్చింది. లైఫ్‌లో థాంక్యూ పదాన్ని చాలా ఎక్కువగా వాడుతుంటాం. 

- ఎక్కడో స్టార్ట్ అయిన నా లైఫ్‌లో ఆటో మొబైల్స్ నడుపుతున్నప్పుడు, ఎడ్యుకేషన్‌ టైమ్‌లోగానీ, డిస్ట్రిబ్యూటర్‌గాగానీ, నిర్మాతగా గానీ చాలా మంది హెల్ప్ చేశారు. సొసైటీకి దిల్‌రాజుగా కనిపిస్తున్నా. నా జర్నీలో నాకు గుర్తుండో, గుర్తులేకనో నాకు చాలా మంది హెల్ప్ చేసుంటారు. ఇప్పుడు ఆగి వాళ్లను కలిసొస్తే, నా ఎమోషన్స్ , వాళ్ల ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేదే కథ. ఈ పాయింట్‌కి నేను కనెక్ట్ అయ్యాను. 

- ఒక డ్రైవర్‌ ఉన్నాడు. ఎక్కడో పని చేస్తుంటాడు. ఇంకొకడు ఇంకో ఆఫర్‌ ఏదో చెప్పి ఉండవచ్చు. ఆ పర్సన్‌ని నిజంగా గుర్తుపెట్టుకుని వాడిని కలిసి, ఫోన్‌  చేసి థాంక్యూ అని చెబితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఫీలింగ్‌ అనిపించింది. అప్పుడు నేను కనెక్ట్ అయ్యి సినిమాగా చేయాలనుకున్నా. అలా ఓ హీరో కేరక్టర్‌ రాయాలనుకున్నాం. అప్పుడు రవితో కూర్చుని కేరక్టర్‌ని అనుకున్నాం. 

- ఆ కేరక్టర్‌కి గతం చెప్పాలనుకున్నాం. కాలేజ్‌, టీనేజ్‌, లైఫ్‌... అన్నిటినీ డిజైన్‌ చేశాం. రవి ఐడియాని మేం అందరం కూర్చుని డిజైన్‌ చేసి మంచి కథ చేశాం. ఎవరు డైరక్ట్ చేస్తే బావుంటుందా? అని ఆలోచించాం. ఇద్దరు, ముగ్గురు డైరక్టర్ల పేర్లు అనుకున్నాం. అప్పుడు నాకు విక్రమ్‌ గుర్తొచ్చాడు.

- గ్యాంగ్‌లీడర్‌ సినిమా ప్రివ్యూ చూడ్డానికి వెళ్లా. స్టార్ట్ కావడానికి పది నిమిషాలు టైమ్‌ ఉందంటే అప్పుడు విక్రమ్‌కి ఈ పాయింట్‌ చెప్పా. విక్రమ్‌ ఎగ్జయిట్‌ అయ్యాడు. 

- స్క్రీన్‌ప్లే, సీన్స్ అన్నీ విక్రమ్‌ స్టైల్‌లో రాయమని అతనికి ఇచ్చాను. ఇది 2019లో జరిగింది.

- ప్యాండమిక్‌ టైమ్‌లో నేను కూడా థాంక్యూ జర్నీని స్టార్ట్ చేశా. నాకు స్కూల్లో హెల్ప్ చేసిన వారిని, ఆటోమొబైల్స్ లో హెల్ప్ చేసిన వారిని అందరినీ కలిశా. ఇంకా ఆ జర్నీ కంటిన్యూ చేయాలి. అప్‌టు 50 పిలిమ్స్ కంటిన్యూ చేయాలి నేను. అదే నా విజన్‌. సినిమా రిలీజకన్నా ముందే కంప్లీట్‌ చేయాలి. కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. నా జర్నీలో నేను కాస్ట్యూమ్స్ కృష్ణ వరకు వచ్చాను. పెళ్లి పందిరి సినిమా సక్సెసే నన్ను నిలబెట్టింది. నా లైఫ్‌ లాంగ్‌ నేను దాన్ని మర్చిపోను. అవన్నీ ఫొటోలు, వీడియోలాగా రెడీ చేస్తున్నా. అక్కడి నుంచి కూడా కంటిన్యూ చేయాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో థాంక్యూ జర్నీని కంటిన్యూ చేయడానికి ప్రిపేర్‌ అవుతున్నా. 

- ఈ కాన్సెప్ట్ ని సినిమాటిక్‌గా చెప్పడానికి ఎక్కువ స్ట్రగుల్‌ అయ్యాం. ఎందుకంటే జనాలు ఆడిటోరియానికి రావడానికి క్యారక్టర్‌ కనెక్ట్ కావాలి, అందుకే ఎక్కువ స్ట్రగుల్‌ ఫేస్‌ చేశాం.

- ఒక నార్మల్‌ కుర్రాడు, ఒక లెజెండరీ అయ్యాడు. అతను మొత్తం నాది అని అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. అతనికి సాయం చేసిన వాళ్లు చాలా మంది ఉంటారు. బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీస్‌, కమర్షియల్‌ యాంగిల్స్ అన్నీ కలిపితే ఈ సినిమా.

- ఈ సినిమాను డిజైన్‌ చేయడం బిగ్‌ జర్నీ. ప్రేమమ్‌లాగా మూడు స్టోరీలున్నాయి. ఆటోగ్రాఫ్‌లాగా ఉంది అని అనడం కూడా విన్నాను.

- ప్రేమమ్‌లో లవ్‌ స్టోరీస్‌ చెప్పారు. కానీ మాది లైఫ్‌ స్టోరీ. టీనేజ్‌లో ఈయనకు లైఫ్‌లో ఏం జరిగింది? కాలేజ్‌లో స్టోరీ ఏం జరిగింది? జీరో నుంచి హీరో ఎలా అయ్యాడు అనేది చాలా ఇంపార్టెంట్‌. 

- నేను మా సినిమా కథను ఎక్కడా హైడ్‌ చేయడం లేదు. స్టోరీ చెప్పేస్తున్నా. ఇప్పుడు గతం గురించి ఆలోచించే టైమ్‌ ఎవరికీ లేదు. 

- విక్రమ్‌  మనంని చాలా అద్భుతంగా హ్యాండిల్‌ చేశాడు. మామూలుగా అయితే మనం కథ వినేటప్పుడు కన్‌ఫ్యూజ్‌ అవుతాం. అయినా చాలా అర్థం చేసుకుని చేశాడు. విక్రమ్‌తో మాట్లాడుతున్నప్పుడు చైతన్య ఎలా ఉంటాడు? అని అన్నాడు. నాకు సూపర్‌ అనిపించింది. చైతన్యని నేను కలిసినప్పుడు వెంటనే ఓకే అన్నాడు. మూడు లుక్స్ కి రెడీ కావాల్సిన క్యారక్టర్‌ అయినా వెంటనే ఓకే చెప్పాడు. విక్రమ్‌కి, చైతూకి ఉన్న కెమిస్ట్రీతో మేం అందరం ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చాం.  చైతన్య ఎక్స్ ట్రార్డినరీ జాబ్‌ చేశాడు. 

- 90 పర్సెంట్‌ విక్రమ్‌ మా అంచనాలను రీచ్‌ అయ్యాడు. 

- యాటిట్యూడ్‌ స్టార్ట్ అయ్యేదే టీనేజ్‌లో. అప్పుడే కాస్త ఇండిపెండెంట్‌ అవుతాం. అప్పటి నుంచే ఈగోలు మొదలవుతాయి. అలాంటి పలు అంశాలతో థాంక్యూ సినిమా యూత్‌కి కనెక్ట్ అవుతుంది.

- పీసీగారు కూడా ఈ సినిమా జర్నీని నమ్మారు. డీఐ చేసేటప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్‌ చేసేటప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు. 

- ప్యాండమిక్‌ ముందు, ప్యాండమిక్‌ తర్వాత టోటల్‌ ఈక్వేషన్స్, మైండ్‌సెట్స్ మారిపోయాయి. అంతకు ముందు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూద్దామనే మూడ్‌లో ఉన్నారు ఆడియన్స్. ప్యాండమిక్‌లో ఇంట్లో కూర్చుని చాలా కంటెంట్‌ చూశారు. అప్పుడు చాలా ఎడ్యుకేట్‌ అయ్యారు. ఇప్పుడు వాళ్లకి అంతంతమాత్రం కంటెంట్‌ నచ్చట్లేదు. దీనికోసం ఇంత డబ్బు పెట్టి వెళ్లాలా? అని అనుకుంటున్నారు. ఈ విషయాల్లో మేం మారాల్సిన టైమ్‌ వచ్చింది.

- ఎలాంటి కంటెంట్‌ని ఇస్తున్నాం అనేది మెయిన్‌ పాయింట్‌. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో హీరోలు 3,4 సినిమాలు లాక్‌ చేసుకున్నారు. ఇప్పుడు ఈ కంటెంట్లతో వచ్చే కథలు సరిపోవడం లేదు. అందుకే ఇప్పుడు మేం హోమ్‌  వర్క్ ఎక్కువ చేయాలనుకుంటున్నాం.

- మా మీటింగ్‌లో మేం ప్రధానంగా చూస్తున్నది మేం ఎడ్యుకేట్‌ కావాలనే విషయాన్నే. నాన్‌ థియేట్రికల్‌, థియేట్రికల్‌ ఎకానమీ మారిపోయింది. వాటి గురించి ఎడ్యుకేట్‌ కావాలనుకుంటున్నాం.

- గతంలో జులైలో బ్లాక్‌బస్టర్‌ హిట్స్ ఉన్నాయి మనకు. సింహాద్రి, తొలిప్రేమ, ఫిదా వంటి సినిమాలన్నీ జులైలో వచ్చాయి మనకు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారు.

- మేజర్‌, విక్రమ్‌ రెండు సినిమాలు జూన్‌ ఫస్ట్ వీక్‌లో వచ్చి ఎగ్జయిట్‌ చేశాయి. ఆడియన్స్ బయటికి వచ్చి బావుందని చెబితే సూపర్‌హిట్‌ అయ్యాయీ ఈ మూవీస్‌.

- ఆడియన్స్ ఎప్పుడూ తప్పుకాదు. 

- చేంజింగ్‌ డైనమిక్స్ వల్ల మా స్టైల్‌ ఆఫ్‌ ఫిల్మ్ మేకింగ్‌ మారింది. 10 స్క్రిప్టులు, రెండు షూటింగులను ఆపేశా. నా అడ్వైజ్‌ ఒక్కటే. ఇప్పుడు డోంట్‌ స్టార్ట్ ఫిలిమ్స్. ఆడియన్స్ మైండ్‌సెట్‌ మారింది. మనల్ని మనం మార్చుకోవాలి. 2023లో ఆడియన్స్ మైండ్‌ సెట్‌ ఎలా మారిందో అర్థం చేసుకోవాలి.

- టికెట్‌ రేట్లు డిస్ట్రిబ్యూటర్‌గా నా చేతిలో ఉండదు. అది ప్రొడ్యూసర్‌ కాల్‌. నా థాంక్యూని ఇప్పుడు 100 ప్లస్‌ జీయస్‌టీ ఇస్తున్నాం. మల్టీప్లెక్స్ లో 150 ప్లస్‌ జీయస్‌టి. ఇందులో 75 మల్టీప్లెక్స్ కి వెళ్తుంది. నాకు 75 వస్తుంది. 

తెలంగాణలో  మినిమమ్‌ దగ్గర నుంచి మ్యాగ్జిమమ్‌ వరకు ఫ్లెక్సీ రేట్లున్నాయి.  కానీ ఆంధ్రాలో 150 ప్లస్‌ జీయస్‌టీ అని జీవో ఇచ్చారు. ఒకసారి తగ్గిస్తే మళ్లీ దాని మీద మేం వర్క్ చేయాలి. దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం.

- నెల రోజుల్లో ఇండస్ట్రీని అందరూ కొత్తగా చూస్తారు.

- జనాల్లో స్పెండింగ్‌ కెపాసిటీ కూడా తగ్గింది. కర్ణుడి చావుకు వంద కారణాలు లాగా సినిమా ఫ్లాప్‌కు చాలా ఇబ్బందులున్నాయి.

- మిడ్‌ రేంజ్‌ నుంచి టాప్‌ స్టార్‌కి వెళ్లే సినిమాలు థియేటర్లలో వచ్చాకే ఓటీటీకి వెళ్లాలి. అది పది వారాలకా? ఎప్పటికా? అనేది ఆలోచిస్తున్నాం. ఈ విషయంలో నిర్మాతలందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం.

- నిర్మాతల చేతిలో ఉన్న పనులు చేసుకుంటే, తర్వాత మిగిలిన విషయాలను గురించి మాట్లాడుకోవచ్చు.

- ఇంతకు ముందు కట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ కాస్ట్  అనేది జరిగినప్పుడు ఆ సమస్య నిర్మాతది మాత్రమే. కానీ ఇప్పుడు సినిమాది. అందుకే అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం.

- ప్రతి సినిమాకీ డబ్బు పోతుందని తెలిస్తే బాధ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ విషయం అర్థమైంది. డైరక్టర్లకీ, హీరోలకీ కూడా విషయం అర్థమైంది. 

- ఆడిన సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి? ఆడిన సినిమాలకు ఒరిజినల్‌ నెంబర్స్ ఏంటి?  అని అనుకుంటున్నాం.

- హిందీ హిట్‌కి కూడా ఓపెనింగ్‌ రాదని ముందే అనుకున్నాం. సినిమా బావుందనుకున్నప్పుడు డే బై డే సినిమా బెటర్‌ అయింది.

- మన దగ్గర ఫ్రైడే, శనివారం, ఆదివారానికి అన్నీ వెళ్లిపోతున్నాయి. సోమవారానికి ఏమీ ఉండటం లేదు. మంచి సినిమాలకు ఆడియన్స్ ఎప్పుడూ రావడానికి సిద్ధమే.

- ఇదే హిట్‌ సినిమా మామూలు రోజుల్లో రిలీజ్‌ అయి ఉంటే మినిమమ్‌ 15 కోట్లు ఉండేది. కానీ ఇవాళ 6,7కోట్లకు వచ్చాం. నాకు 66 పర్సెంట్‌ తగ్గింది. మంచి సినిమా తీసినా ఇలా అయితే, ఇప్పుడు నేను డబుల్‌ చెక్‌ చేసుకోవాల్సి వస్తుంది. ఎకానమిక్స్, డైమన్షన్స్ మారిపోయాయి. వాటిని అర్థం చేసుకోవాలి.

- జెర్సీలో ప్యాండమిక్‌ లేకుంటే 30  కోట్లు లాభం రావాల్సిన సినిమా. వెళ్తున్న కొద్దీ 30 రాదులే, 15 వస్తుందిలే అని అనుకున్నాం. ఇంకో స్టేజ్‌లో 10 అనుకున్నాం. రిలీజ్ డేట్లు మూడు సార్లు మార్చాం. అప్పుడు లాభం లేకున్నా ఫర్వాలేదు కానీ, బయటపడితే చాలనుకున్నాం. 3-4 కోట్ల డ్యామేజ్‌తో బయటపడ్డాం. ఏమాత్రం ఓపెనింగ్‌ వచ్చినా చాలనుకున్నాం. హిట్‌ మాత్రం బయటపడేస్తుంది నిర్మాతలను.

- ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా, నష్టమే ఉంది. ఓటీటీలో సూపర్‌హిట్‌ అయినా నాకు వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజ్‌ అయితే ఆ ఎనర్జీ వేరు. ఆడుతున్నకొద్దీ ఎవ్రీ డే కలెక్షన్లు వింటుంటే నిర్మాతలకు ఎనర్జీ ఇస్తుంది. సినిమా ప్యాషన్‌గా తీయాలనుకున్నవారికి ఎకానమిక్స్ ముఖ్యమే. ఎనర్జీ కూడా ముఖ్యమే. మైనస్‌లు తీసేసి, ప్లస్‌ల వైపు డ్రైవ్‌ చేయాలి. ప్రొడ్యూసర్ల గురించి హీరోలకు కన్‌సర్న్ ఉంటుంది. వాళ్లకీ అన్నీ తెలుసు. కాబట్టి వాళ్లందరినీ కూర్చోబెట్టి అడ్రస్‌ చేయాలి. అందరూ అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. సమస్యను అర్థమయ్యేలా చెబితే సరిపోతుందని నా ఫీలింగ్‌.

Dil Raju Interview:

Dil Raju Interview about Thank You Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ