రెండు రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కారులో ఏపీ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఆ గుంతల రోడ్డుని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ Good Morning CM Sir అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో.. జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫాన్స్ #GoodMorningCMSir అంటూ హాష్ టాగ్ పెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా ట్విట్టర్ లో నేషనల్ వైడ్ గా #GoodMorningCMSir హాష్ టాగ్ ట్రెండ్ అవడంతో.. మొదటిసారి జనసేన పార్టీ సక్సెస్ అయ్యింది, నిన్నమొన్నటివరకు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పోరాడుతున్న ఏనాడూ ఇంతగా హైలెట్ కాలేదు కానీ.. ఇప్పుడు మాత్రం #GoodMorningCMSir హాష్ టాగ్ తో జనసేన కొత్త ట్రెండ్ సృష్టించింది అంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో కార్టూన్స్ ని షేర్ చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ చేసే పనులపై సెటేరికల్ గా కార్టూన్ చేయించి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిన్న ఆయన ఓ కార్టూన్ షేర్ చేసారు. అది #GoodMorningCMSir హాష్ టాగ్ గురించి.. ఏపీ సీఎం జగన్ ఇంకోసారి అన్నావో ఛంపేస్తా అంటూ జగన్ కోప్పడుతున్న సీన్ చూస్తూ ఓ ఇద్దరు పోలీస్ వాళ్ళు గుడ్ మార్నింగ్ సీఎం సర్ అన్నా అంతే దానితో జగన్ గారు ఊగిపోతున్నారు, అని చూస్తున్న కార్టూన్ అది. ఇప్పుడు ఆ కార్టూన్ తెగ వైరల్ అయ్యింది.