నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆస్ట్రాలజర్ వేణు స్వామి మీడియాలో బాగా హైలెట్ అయ్యారు. కారణం నాగ చైతన్య పెళ్లప్పుడే వారికి విడాకులు అవుతాయని చెప్పాను, అలాగే అఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవుతుంది అని చెప్పాను అంటూ చేసిన వ్యాఖ్యలు హైలెట్ అయ్యాయి. తర్వాత ప్రభాస్ జాతకం, పూజ హెగ్డే, రష్మిక జాతకాలను చెబుతూ వచ్చాడు. తాజాగా వేణు స్వామి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. కారణం కృష్ణ ఫ్యామిలీ విషయాలను చెప్పడంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.
వేణు స్వామి మట్లాడుతూ తనకి సూపర్ స్టార్ కృష్ణగారంటే చాలా ఇష్టం అని, ఆయన ఇంట్లో పూజలు చేసే తాను జాతకాలు కూడా చెప్పేవాడిని అని, తాను ఎంత స్థాయికి ఎదిగినా కృష్ణ గారి ఇంట్లో పూజలు చెయ్యడం మానలేదు అని, అలా 2014 కి ఓ పూజ కోసం వెళ్ళినప్పుడు కృష్ణ, విజయ నిర్మలగారి జాతకాలు చూసి.. వారిద్దరిలో ఎవరో ఒకరు 2020లో చనిపోతారని చెప్పాను. ఆ మాటలలకు వారు భయపడ్డారు. నరేష్ కూడా అడిగారు. ఇలా ఎందుకు అన్నారు అని, నాకు ఇష్టమైన వాళ్ళు కి ఏం జరక్కూడదు, పరిహార పూజ చేయిద్దామని చెప్పాను. ఇక అదే ఏడాది నరేష్ - రమ్య రఘుపతి వివాహం జరిగింది. నేను జాతకాలు చూసి పెళ్లి వద్దు, జాతకాలు కలవలేదు అన్నాను. కానీ వారు జాతకాలు మార్చి వివాహం చేసుకున్నారేమో. పెళ్లయినా విడాకులు అవుతాయని చెప్పిన నేను ఆ వివాహం మాత్రం నా చేతులు మీదుగా జరిపించలేదు, కానీ వ్రతం మాత్రం నేనే చేశాను.
ముహూర్త సమయంలో ఎంత చెప్పినా వారు వినలేదు. వారి పెళ్లి వారిష్టం. కానీ జాతకాలూ కలవకుండా చేసుకుంటే ఏమవుతుందో అనేది ఇదొక ఉదాహరణగా చెప్పడానికి నేను ఈ విషయం బయట పెట్టాను అంటూ చెప్పుకొచ్చారు ఆయన.