బిగ్ బాస్ ఓటిటి ముగిసిన వెంటనే బిగ్ బాస్ 6 కోసం యాజమాన్యం అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టేసింది. ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి బిగ్ బాస్ సీజన్ 6 నాగార్జున వ్యాఖ్యాతగా మొదలు పెట్టేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తుంది. అలాగే కొంతమంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసి వాళ్లతో అగ్రిమెంట్ కూడా పూర్తి చేస్తుంది అంటున్నారు. ఇప్పటికే హీరో తరుణ్, మాజీ హీరో నవీన్ పేర్లు బిగ్ బాస్ 6 లోకి వెళ్ళేవారిలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో సీరియల్ ఆర్టిస్ట్ పేరు తెరమీదకి వచ్చింది. అతనే కృష్ణ కౌశిక్.
దేవత సీరియల్, ప్రస్తుతం కుంకుమ పువ్వు సీరియల్స్ చేస్తున్న కృష్ణ కౌశిక్ బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కృష్ణ కౌశిక్ అందరికి పరిచయం అయినా.. ఆయన సీరియల్స్ ద్వారానే అభిమానులని సంపాదించుకున్నారు. ఇప్పటికే కౌశిక్ ని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించింది అని, అంతేకాకుండా కౌశిక్ కి పారితోషకం కూడా గట్టిగానే ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి సోషల్ మీడియాలో ఎంతమంది పేర్లు వినిపిస్తున్నా.. ఫైనల్ గా బిగ్ బాస్ సిక్స్ లోకి ఎవరెవరు అడుగుపెడతారో అనే సస్పెన్స్ మాత్రం బుల్లితెర ప్రేక్షకుల్లో బాగా క్రియేట్ అయ్యింది.