పెళ్లి చేసుకుంది.. నయనతార కెరీర్ అయ్యిపోయింది.. విగ్నేష్ ని వివాహం చేసుకున్నాక నయనతార కి అవకాశాలే రావు అనుకుంటే.. ఈ లేడీ సూపర్ స్టార్ కి అవకాశాలు క్యూ కట్టడమే కాదు, పెళ్లి తర్వాత పారితోషకం పెంచి షాకిచ్చింది అంటూ కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం షారుఖ్ తో అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాకి నయనతార 8 నుండి 9 కోట్లు వరకు పారితోషకం తీసుకుంటుంది అంటున్నారు.
కానీ నయనతార కెరీర్ లో 75 వ చిత్రంగా జీ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో చెయ్యబోయే చిత్రానికి 10 కోట్లు డిమాండ్ చేసింది అని తెలుస్తుంది. ఆ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడంతోనే నయన్ అంత డిమాండ్ చేసింది అని.. ఇప్పటివరకు 7 కోట్లు వరకు పారితోషకం అందుకుంటున్న నయనతార అట్లీ మూవీ బాలీవుడ్ మూవీ కావడంతో ఆ సినిమాకే ఎక్కువ రెన్యుమరేషన్ తీసుకుంటుంది అంటే.. ఇప్పుడు 75 వ చిత్రానికి మరింతగా పెంచేసింది నయన్ అంటున్నారు. మరి పెళ్ళికి ముందు కన్నా పెళ్లి తర్వాతే నయనతార డిమాండ్, క్రేజ్ పెరిగాయా.. అందుకే నయన్ పారితోషకం అంత పెంచింది అంటున్నారు. ఇదే నిజమైతే నయన్ కి విగ్నేష్ తో వివాహం కలిసొచ్చినట్టే.