Advertisementt

అవి చూసి కృష్ణవంశీ, రమ్య నవ్వుకుంటారట!

Thu 21st Jul 2022 09:14 AM
krishna vamsi,rumours,ramyakrishna,relation,ranga marthanda,krishna vamsi about ramya krishna,ramya krishnan  అవి చూసి కృష్ణవంశీ, రమ్య నవ్వుకుంటారట!
Krishna Vamsi Talks about Bonding with Ramyakrishna అవి చూసి కృష్ణవంశీ, రమ్య నవ్వుకుంటారట!
Advertisement
Ads by CJ

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, శివగామి రమ్యకృష్ణ కలిసే ఉన్నారా? విడిపోయారా?.. చాలా కాలంగా ఈ ప్రశ్న తలెత్తుతూనే ఉంది. ఈ ప్రశ్న వినిపించిన ప్రతీసారి.. అటు రమ్యకృష్ణో, ఇటు కృష్ణ వంశీనో బదులిస్తూనే ఉంటారు. అయినా కూడా ఆ ప్రశ్న మాత్రం వైరల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే వారిద్దరూ కలిసి ఏనాడూ కనిపించరు. ఎవరి దారి వారేది అన్నట్లుగా ఉంటారు. అందుకే ఈ ప్రశ్న పదే పదే వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ‘రంగమార్తాండ’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న కృష్ణ వంశీకి ఇదే ప్రశ్న మరోసారి ఎదురైంది. ఈసారి కృష్ణ వంశీ కాస్త స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు. అది కేవలం గాసిప్పు మాత్రమే.. ఇలాంటి రూమర్లను చూసి, విని.. నేను, రమ్య నవ్వుకుంటూ ఉంటాం.. అని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు. 

 

కృష్ణ వంశీ, రమ్యకృష్ణల మధ్య ఉన్న బంధంపై తాజాగా కృష్ణ వంశీ మాట్లాడుతూ.. ‘‘నాకు ఫస్ట్ నుంచి ఒంటరిగా జీవించడమంటే ఇష్టం. మనసులో బంధాలపై వ్యామోహం ఎప్పుడూ లేదు. బాధ్యతలకు, బంధాలకు దూరంగా ఉండాలనుకునే మనస్తత్వం నాది. అలాంటి మనస్తత్వం ఉన్న నాకు, రమ్యకృష్ణతో పరిస్థితుల ప్రభావంతో పెళ్లయింది. నా మనస్తత్వం ఎలా ఉన్నా.. రమ్య ఇష్టాలను మాత్రం నేనెప్పుడూ గౌరవిస్తాను. అలాగే.. నా ఇష్టాలను, అభిరుచులను రమ్య కూడా గౌరవిస్తుంది. మేం విడిపోయామని, మా మధ్య గొడవలు జరుగుతున్నాయని చాలా మంది, చాలా సార్లు అడిగారు, రాస్తున్నారు. అవన్నీ గాసిప్స్ అని ఎన్నో సార్లు చెప్పా.. అలాంటి అవాస్తవాలని నమ్మవద్దని కూడా చెప్పా. అయినా కూడా అలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ రూమర్లు చూసి మేమిద్దరం నవ్వుకుంటాం. సెలబ్రిటీలుగా పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్నాం కాబట్టి.. ఇలాంటి రూమర్స్ సర్వ సాధారణం అని.. వాటిని పట్టించుకోవడమే మానేశాం. మేమేంటో, మా ఇద్దరి మధ్య ఎటువంటి బంధం ఉందో.. మాకు తెలుసు. మా గురించి తెలిసిన వారందకీ తెలుసు. దీనిపై పదే పదే వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు..’’ అని కృష్ణవంశీ తన తాజా ఇంటర్వ్యూలో వివరంగా చెప్పుకొచ్చారు.

Krishna Vamsi Talks about Bonding with Ramyakrishna:

Krishna Vamsi Clarity about Rumours on His and Ramyakrishna Relation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ