Advertisementt

మెగా-మాస్ కాంబో.. పూనకాలే!

Sun 17th Jul 2022 07:25 PM
mega star,chiranjeevi,mass maharaja,ravi teja,mega 154,bobby,video  మెగా-మాస్ కాంబో.. పూనకాలే!
Mass Maharaja Joins Mega154 sets మెగా-మాస్ కాంబో.. పూనకాలే!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘మెగా154’. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనేది టైటిల్‌గా వినబడుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి పోస్టర్ వైరల్ అవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఆ అంచనాలు మరింత పెరిగేలా.. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా రివీల్ చేశారు. తాజాగా ఈ మూవీ సెట్స్‌లోకి రవితేజ అడుగు పెట్టినట్లుగా ఓ వీడియోని మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ వీడియో చూస్తుంటే.. మెగా-మాస్ కాంబోకి పూనకాలే అన్నట్లుగా వైబ్రేషన్స్ వస్తున్నాయి. 

 

వాస్తవానికి ముందే రవితేజ ఈ చిత్రంలో చేస్తున్నట్లుగా వార్తలు వచ్చినా.. తర్వాత అతనికి ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకున్నాడని, మరో యంగ్ హీరో కోసం బాబీ చూస్తున్నాడనేలా ఈ మధ్య రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్‌ని పటాపంచల్ చేస్తూ.. మేకర్స్ అధికారికంగా వీడియోని విడుదల చేసి.. రవితేజ ఈ సినిమాలో చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో అటు మెగాభిమానులు, ఇటు మాస్ మహారాజా అభిమానులు సోషల్ మీడియాలో ప్రస్తుతం పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Mass Maharaja Joins Mega154 sets :

Mega and Mass Combo Video From Mega 154 Goes Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ