Advertisementt

నాగబాబు కన్నా రోజాకే రెమ్యూనరేషన్ ఎక్కువ!

Sun 17th Jul 2022 04:48 PM
jabardasth,naga babu,roja,remuneration,production manager,yedukondalu,  నాగబాబు కన్నా రోజాకే రెమ్యూనరేషన్ ఎక్కువ!
Jabardasth Production Manager Yedukondalu about Jabardasth Judges Remuneration నాగబాబు కన్నా రోజాకే రెమ్యూనరేషన్ ఎక్కువ!
Advertisement
Ads by CJ

జబర్దస్త్‌లో ఎవరికి ఎంత పారితోషికం ఉంటుందో.. అనే విషయంలో చాలా రకాల అనుమానాలు బుల్లితెర ఆడియన్స్‌లో ఉన్నాయి. టాప్ కమెడియన్స్ లక్షల్లో పారితోషికాలు తీసుకుంటారని.. నాగబాబు, రోజా ఎపిసోడ్‌కి ఇంతని తీసుకుంటారని సోషల్ మీడియాలో చాలా రకాల న్యూస్‌లు హైలెట్ అవుతూనే ఉంటాయి. తాజాగా నాగబాబు, రోజా పారితోషికాలు ఎంత ఉంటాయి అనే విషయాన్ని జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

 

హీరోయిన్‌గా పని చేసిన రోజాకు ఎక్కువ పారితోషకం ఇస్తామని, అలాగే సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా పని చేసేవారికి తక్కువ పారితోషకం ఉంటుంది అని, అదే హీరోలెవరైనా జబర్దస్త్ షో కి గెస్ట్‌గా వస్తే వారికి కొద్దిగా ఎక్కువ పేమెంట్ ఇస్తామని ఏడుకొండలు చెప్పాడు. అంటే ఒకప్పుడు హీరోయిన్‌గా కనిపించిన రోజాకి జబర్దస్త్‌లో ఎక్కువ పారితోషకం ఉండగా.. ఫాదర్ కేరెక్టర్స్, విలన్ కేరెక్టర్స్ చేసే నాగబాబు‌కి తక్కువ పారితోషకం ఉంటుంది అని ఫిగర్ బయటపెట్టకపోయినా ఏడు కొండలు జబర్దస్త్ జెడ్జెస్ పారితోషికాలను రివీల్ చేశాడు. ఇప్పటివరకు నాగబాబు సీనియర్.. ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది, రోజాకి తక్కువ పారితోషకమే ఉంటుంది అనుకున్నారు. కానీ ఇక్కడ సీనియారిటీ ముఖ్యం కాదు, క్రేజ్ ముఖ్యమని మల్లెమాల నిరూపించింది.

Jabardasth Production Manager Yedukondalu about Jabardasth Judges Remuneration:

Jabardasth: Naga Babu and Roja Remuneration comparison

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ