Advertisementt

ఫస్ట్ టైమ్ మెగాస్టార్ చిరు ఆ పని చేస్తున్నారు

Sat 16th Jul 2022 08:57 PM
chiranjeevi,aamir khan,laal singh chadda,presentation,tollywood,premiere,nagarjuna,naga chaitanya,ss rajamouli,sukumar,aamir khan film  ఫస్ట్ టైమ్ మెగాస్టార్ చిరు ఆ పని చేస్తున్నారు
Mega Star Chiranjeevi Presents Aamir Khan Laal Singh Chadda In Tollywood ఫస్ట్ టైమ్ మెగాస్టార్ చిరు ఆ పని చేస్తున్నారు
Advertisement
Ads by CJ

ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో ఇప్పటి వరకు చిరు చేయని ఓ పనిని ఇప్పుడు చేస్తున్నారు. అదీ కూడా ఓ బాలీవుడ్ హీరో కోసం. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. టాలీవుడ్ హీరో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి కోసం చిరు ఇంట్లో ఆమిర్ ప్రత్యేక ప్రీమియర్‌ని ఏర్పాటు చేశారు. చిరంజీవి, ఆమిర్ ఖాన్‌లతో పాటు రాజమౌళి, సుకుమార్, నాగార్జున, నాగచైతన్య వంటి వారు కూడా ఈ ప్రీమియర్ షో‌లో భాగమయ్యారు. ఈ షో అనంతరం.. ఆమిర్ ఖాన్‌పై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఆమిర్ నటనకు మెగాస్టార్ మురిసిపోయారు. ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయాలని ఆమిర్‌ని చిరంజీవి కోరారు. అందుకు అంగీకరించిన ఆమిర్.. తెలుగులో ఈ సినిమాని మీరే సమర్పించాలని కోరారు. ఆమిర్ ఖాన్ మాట కాదనలేక.. ఫస్ట్ టైమ్ చిరంజీవి ఓ సినిమాని సమర్పిస్తున్నారు. చిరంజీవి ఈ సినిమాని సమర్పిస్తున్నట్లుగా ఓ పోస్టర్ కూడా ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

 

తొలిసారి మెగాస్టార్ ఇలా ఓ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో.. టాలీవుడ్ అంతా ఈ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఉన్న విషయం చిరంజీవిని అంతగా మెప్పించింది కాబట్టే.. ఆయన ఈ చిత్రానికి ఏదో విధంగా భాగం కావాలని కోరుకున్నారని, అందులో భాగంగానే తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఇదో మంచి శుభ పరిణామంగా కూడా అంతా భావిస్తున్నారు. ఇండియన్ యాక్టర్స్ మధ్య ఇటువంటి బాండింగ్ ఉండటం అనేది ఆహ్వానించదగిందని.. చిరు, ఆమిర్‌ల బాండింగ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రాన్ని చిరంజీవి సమర్పణలో వయోకామ్ 18 స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి‌దేశ్ పాండే, అజిత్ అంథారే నిర్మిస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. 

Mega Star Chiranjeevi Presents Aamir Khan Laal Singh Chadda In Tollywood:

Mega Star shares his Laal Singh Chadda experience

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ