Advertisementt

‘సలార్’ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

Sat 16th Jul 2022 04:33 PM
prabhas,salaar,young rebel star,prashanth neel,prabhas fans,no updates,rebel star,prabhas hero  ‘సలార్’ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
Prabhas Fans Fire on Salaar Makers ‘సలార్’ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
Advertisement
Ads by CJ

ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబోలో సెన్సేషనల్ మూవీగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ‘సలార్’పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ‘కెజియఫ్’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి సినిమా చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. ‘సాహో’, ‘రాధే శ్యామ్’ డిజప్పాయింట్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ యాక్షన్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. అయితే సలార్ రెజ్యూమ్ షూట్ మే‌లో మొదలు కాగానే సలార్ టీజర్ ఇస్తామని మేకర్స్ ఎప్పుడో చెప్పారు. మే వెళ్ళింది, జూన్ వెళ్ళింది, జూలై కూడా సగం పూర్తయ్యింది. కానీ మేకర్స్ నుండి సలార్ అప్‌డేట్ రావడం లేదు.

 

ఈ మధ్యన సలార్ టీజర్‌ని ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఇవ్వబోతున్నారని అన్నప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం సలార్ టీజర్ ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సలార్ ప్రభాస్ ఫస్ట్ లుక్, లీకెడ్ పిక్స్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి సత్తా చూపిన ఫ్యాన్స్.. సలార్ టీజర్ వస్తే లైక్స్, వ్యూస్ విషయంలో రికార్డులు సెట్ చెయ్యాలనే కసితో ఉన్నారు. కానీ ప్రశాంత్ నీల్, ప్రభాస్, సలార్ మేకర్స్ సలార్ టీజర్ విషయంలో సైలెంట్ గా ఉండడం చూసిన ఫ్యాన్స్ సదరు నిర్మాణ సంస్థపై ఫైర్ అవుతున్నారు.

Prabhas Fans Fire on Salaar Makers:

No Updates From Salaar Movie.. Prabhas Fans Angry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ