అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫస్ట్ మూవీలో సయేశాతో రొమాన్స్ చేశాడు. తర్వాత ‘హలో’ మూవీలో కళ్యాణి ప్రియదర్శినితో కలిసి నటించాడు. ఇక ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నఅఖిల్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో పూజా హెగ్డేతో కలిసి కుమ్మేసాడు. ఈ సినిమా విజయం వెనుక అఖిల్ హార్డ్ వర్క్ ఎంతుందో.. పూజా హెగ్డే గ్లామర్ షో అంతే కారణం అయ్యింది. పూజా హెగ్డే గ్లామర్ షో, ఆమె క్రేజ్ అన్ని అఖిల్‌ని హిట్ కొట్టేలా చేశాయి. అఖిల్ హైట్‌కి, వెయిట్‌కి పూజా హెగ్డే ఫిగర్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యింది. కానీ ఇప్పుడు అఖిల్ ‘ఏజెంట్’ మూవీలో సాక్షి వైద్యతో కలిసి నటిస్తున్నాడు.
అయితే రీసెంట్‌గా ఏజెంట్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఆ టీజర్‌లో సాక్షిని జస్ట్ సింగిల్ టేక్‌కి పరిమితం చేశారు. అందులో సాక్షి గ్లామర్ ఎక్స్‌పోజ్ అవ్వలేదు. ఆమె కేరెక్టర్ రివీల్ కాలేదు. అలాగే లుక్స్ కూడా ఓకే ఓకే అన్నట్లుగానే వున్నాయి. ఇక అఖిల్ ఏజెంట్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సాక్షి వైద్యని చూస్తే అఖిల్‌కి ఈ హీరోయిన్ అస్సలు మ్యాచ్ కావడం లేదు, ఇక సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ ఏం వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఏజెంట్‌లో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత లేకపోయినా.. ఆమె లుక్స్‌పై ఫ్యాన్స్ స్పెషల్‌గా ఫోకస్ చేస్తారు. మరి ముంబై మోడల్‌గా ఒక్క సినిమా ఎక్స్‌పీరియెన్స్ కూడా లేని సాక్షి అఖిల్ పక్కన తేలిపోతుందేమో అని ఫ్యాన్స్ బెంగపెట్టేసుకుంటున్నారు.