ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్ కి జేడ్జ్ గాను, శ్రీదేవి డ్రామా కంపెనీలో గెస్ట్ గా కనిపిస్తుంది ఇంద్రజ. యమలీల లో హీరోయిన్ గా కనిపించిన ఆవిడ పెళ్లి తర్వాత సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చేసింది. తాజాగా రోజా జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతో ఆ ప్లేస్ లోకి ఇంద్రజ వచ్చింది. ఇంద్రజ జబర్దస్త్ కమెడియన్స్ తో బాగా కలిసిపోయింది. సుధీర్ టీం లో సుధీర్, శ్రీను వెళ్లిపోవడం, రామ్ ప్రసాద్ ఒంటరివాడు కావడంతో ఇంద్రజ బాగా ఫీలైంది. కంటతడి పెట్టింది. తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఇంద్రజ తన పెళ్లి పై ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది.
వెంకీ మనకి టీం లీడర్ వెంకీ తన భార్య ని పిల్లలని జబర్దస్త్ స్టేజ్ పై పరిచయం చేసాడు. ఆ తర్వాత ఇంద్రజ మట్లాడుతూ తన పెళ్ళికి కేవలం 13 మంది హాజరయ్యారని చెప్పింది. 2006లో నటుడు, బిజినెస్‌మెన్ మహమ్మద్ అబ్సర్‌ను పెళ్లాడింది ఇంద్రజ. ప్రేమ పెళ్లా.. పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది క్లారిటీ ఇవ్వలేదు కానీ, తన పెళ్ళికి కేవలం 7500 ఖర్చు అయ్యింది అని చెప్పి షాకిచ్చింది. దానితో ఇంద్రజ తన భర్త ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందేమో అందుకే ఇంత తక్కువ ఖర్చు అయ్యింది అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.