Advertisementt

పెళ్లి, నిశ్చితార్ధమా.. ఏం మాట్లాడుతున్నారు

Fri 15th Jul 2022 09:17 PM
sushmita sen,lalit modi,not married,no rings  పెళ్లి, నిశ్చితార్ధమా.. ఏం మాట్లాడుతున్నారు
Sushmita Sen Finally reacts to Lalit Modi dating confession పెళ్లి, నిశ్చితార్ధమా.. ఏం మాట్లాడుతున్నారు
Advertisement
Ads by CJ

ఐపీల్ వ్యవస్థాపకుడు, మొదటి చైర్మన్ లలిత్ మోడీ కొన్నాళ్లుగా ఇండియాలో ఉండడం లేదు, లలిత్ మోడీపై ఉన్న ఆరోపణల కారణంగా ఆయన ఇండియా నుండి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటూ సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తున్నారు. కానీ ఉన్నట్టుండి నిన్న గురువారం సాయంత్రం తాను బాలీవుడ్ నటి సుశ్మిత సేన్ డేటింగ్ లో ఉన్నామని, తనకి బెటర్ పార్ట్నర్ దొరికింది అని, తామిద్దరం కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసాం అని, పెళ్లి కూడా ఏదో ఒకరోజు జరుగుతుంది అంటూ ట్వీట్ల వర్షం కురిపించడమే కాకుండా.. లలిత్ మోడీ - సుశ్మిత సేన్ క్లోజ్ గా వున్న ఫొటోస్ ని షేర్ చెయ్యడంతో ఈ న్యూస్ బాలీవుడ్, అలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

దానితో సుశ్మిత సేన్ కి లలిత్ మోడీకి ఆల్రెడీ పెళ్లి కూడా అయ్యిపోయింది అంటూ ప్రచారం మొదలు కావడంతో.. సుశ్మిత సేన్ డైరెక్ట్ గా సీన్ లోకి వచ్చి, తాను లలిత్ మోడీతో డేటింగ్ లో ఉన్న విషయం ప్రస్తావించకుండా త‌న‌కు ఇంకా పెళ్లి కాలేద‌ని, క‌నీసం నిశ్చితార్థం కూడా కాలేద‌ని.. తాను ప్ర‌స్తుతం సంతోషంగా ఉన్నాన‌ని ట్వీట్ చేసింది. ఈ విషయంలో తాను పూర్తి స్థాయిలో స్ప‌ష్ట‌త ఇచ్చినట్టుగానే భావిస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది సుశ్మిత సేన్.

Sushmita Sen Finally reacts to Lalit Modi dating confession:

Sushmita Sen reacts to Lalit Modi declaration of love: Not married…no rings

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ