Advertisementt

RC 15 టెర్రిఫిక్ సీన్స్ అప్ డేట్

Fri 15th Jul 2022 07:56 PM
rc 15,rc 15 shooting update,ram charan,kiara advani,shankar  RC 15 టెర్రిఫిక్ సీన్స్ అప్ డేట్
RC 15 Shooting update RC 15 టెర్రిఫిక్ సీన్స్ అప్ డేట్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో RC15 చేస్తున్నారు. గత వారం అమృతసర్ లో ఓ సాంగ్ షూట్ చిత్రీకరణ చేసిన శంకర్ ఇప్పుడు RC15 కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తున్నారు. కియారా అద్వానీ కూడా RC15 టీం కి అందుబాటులోకి రావడంతో శంకర్ చకచకా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్ ఒకటి ప్లాన్ చేశారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. ఇంతవరకు తన సినిమాల్లో కానీ, రామ్ చరణ్ మూవీస్ లో కానీ చూడని ఫైట్ ని శంకర్ ఈ RC15 కోసం స్పెషల్ గా డిజైన్ చేశారట. సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో ఈ ఫైట్ సీన్ వస్తుందని అంటున్నారు. ఈ టెర్రిఫిక్ సీన్స్ కోసం రామ్ చరణ్ రెడీ అయ్యారట. ఈ సినిమాలో విలన్ గా ఎస్ జె సూర్య నటిస్తున్నారనే న్యూస్ ఉన్నప్పటికీ.. అధికారిక ప్రకటన రాలేదు. 

RC 15 Shooting update:

Ram Charan RC 15 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ