అక్కినేని అఖిల్ ఇప్పటివరకు లవర్ బాయ్ లా స్టైలిష్ గానే కనిపించాడు. కానీ ఫస్ట్ టైం మాస్ లుక్స్ లో, అదిరిపోయే మేకోవర్ తో ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ టీజర్ రిలీజ్ చేసారు. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతున్న ఏజెంట్ టీజర్ ని అన్ని భాషల్లో రిలీజ్ చేసారు మేకర్స్. అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఏజెంట్ టీజర్ లోకి వెళితే..
నిమిషం16 సెకన్లు నిడివి గల ఏజెంట్ టీజర్ స్లిక్, స్టైలిష్ యాక్షన్-ప్యాక్డ్ గా అదరగొట్టింది. నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీహెడ్ మహదేవ్ పాత్ర పోషిస్తున్న మమ్ముట్టిని విచారిస్తుండగా.. అతను ఏజెంట్ క్యారెక్టర్ గురించి పవర్ ఫుల్ గా వివరించడం ఆసక్తికరంగా వుంది. అతన్ని పట్టుకోగలమా ? అని ఓ ఆఫీసర్ అడిగితే.. నో హీఈజ్ అన్ ప్రిడిక్టబుల్. నో విట్నేస్, నో ఫారిన్సిక్ ఎవిడెన్స్. అతని డెత్ నోట్ ఆల్రెడీ రాసుంది అని మమ్ముటి చెప్పడం టెర్రిఫిక్ గా వుంది.
మహదేవ్ పాత్ర చెప్పినట్లే టీజర్ లో అఖిల్ యాక్షన్ అవుట్ స్టాండింగా వుంది. చావుకు భయపడిన ఏజెంట్ పాత్రలో కనిపించారు అఖిల్. టీజర్ చివరి తనని చంపని అరిచే సీక్వెన్స్ లో ఏజెంట్ ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలచారు.
యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌తో ఎక్స్ టార్దినరీ నటనతో అఖిల్ మెస్మరైజ్ చేశారు. అఖిల్ మేకోవర్ నిజంగా అద్భుతంగా వుంది. హీరోయిన్ సాక్షి వైద్య ఏజంట్ ని వైల్డ్ సాలే అని పిలుస్తూ కూల్ అండ్ బ్యూటీఫుల్ గా కనిపించింది. నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీహెడ్ మహదేవ్ పాత్రలో మమ్ముట్టి హుందాగా కనిపించారు. మహదేవ్ పాత్రలో ఆయన కనిపించిన తీరు ఆ పాత్రకు వన్నె తెచ్చినట్లుగా వుంది.
టీజర్ మొత్తం స్లీల్‌గా, స్టైలిష్‌గా ఉంది, సురేందర్ రెడ్డి విజువలైజేషన్ వండర్ఫుల్ గా వుంది. రసూల్ ఎల్లోర్ ఏజెంట్ వరల్డ్ ని అద్భుతంగా చిత్రీకరించారు. హిప్ హాప్ తమిజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏజంట్ పాత్రని అద్భుతంగా ఎలివేట్ చేసింది.