Advertisementt

రవితేజ తో సినిమా అంటే..

Fri 15th Jul 2022 12:07 PM
ravi teja,khiladi movie,ramarao on duty promotions  రవితేజ తో సినిమా అంటే..
Ravi Teja missing in Promotions రవితేజ తో సినిమా అంటే..
Advertisement
Ads by CJ

ఒకప్పుడు రవితేజ ఎలా ఉండేవాడో.. ఇప్పుడు ఎలా ఉన్నాడో అంటున్నారు చాలామంది. అంటే ఫిజిక్ విషయం లో కాదు, కెరీర్ విషయంలో ఇక వరస ప్లాప్స్ తో ఉన్న రవితేజ ని క్రాక్ మూవీ నిలబెట్టింది. తర్వాత చేసిన ఖిలాడీ రవితేజకి భారీ డిసాస్టర్ ఇచ్చింది. అయితే ఖిలాడీ సినిమా అప్పుడు రవితేజ నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడు, డబ్బింగ్ చెప్పకుండా, ప్రమోషన్స్ కి రావాలంటే కోట్లు అడుగుతూన్నాడనే మాట వినిపించింది. జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసి మిగతా ప్రమోషన్స్ ని రవితేజ లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు రామ రావు ఆన్ డ్యూటీ విషయంలోనూ రవితేజ అలాగే చేస్తున్నాడనే మాట వినిపిస్తుంది.

శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చేసాడు. ఈ సినిమా ఇప్పటికే రెండుమూడుసార్లు విడుదల తేదీ మార్చుకుని.. చివరికి ఈ నెల 30 న రిలీజ్ కి రెడీ అయ్యింది. రేపు సాయంత్రం రామ రావు ఆన్ డ్యూటీ ట్రైలర్ లాంచ్ ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు మేకర్స్. ఇప్పటికే హీరోయిన్స్, ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి, దర్శకుడు శరత్ లు సినిమా ప్రమోషన్స్ అంటూ ఇంటర్వూస్ లో పాల్గొంటున్నారు. కానీ రవితేజ మాత్రం ఇంతవరకు ప్రమోషన్స్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. రవితేజ తో సినిమా చెయ్యాలంటే హీరోగా ఓ రేటు, డబ్బింగ్ కి మరో రేటు, ప్రమోషన్స్ కి ఓ రేటు ఫిక్స్ చెయ్యాల్సిందే.. లేదంటే ఆయన నిర్మాతలని ఇబ్బంది పెట్టడానికి వెనుకాడరు అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతుంది..

ఇలాంటి ప్రచారాలు కెరీర్ ని డ్యామేజ్ చెయ్యడంలో కీలకంగా కనిపిస్తాయి. రవితేజ ఇప్పటికైనా ఆలోచించుకుంటే బావుంటుంది.

Ravi Teja missing in Promotions :

Ravi Teja missing in Ramarao on Duty Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ