ఉప్పెన మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబమ్మ కృతి శెట్టి.. తర్వాత నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాతో కూడా హిట్ కొట్టేసింది. ఉప్పెన సినిమాలో అమాయకపు పల్లెటూరి అమ్మాయిగా కనబడిన కృతి శెట్టి, శ్యామ్ సింగ రాయ్ లో మోడ్రెన్ అమ్మాయిలా దమ్ము కొట్టింది. తర్వాత నాగార్జున - నాగ చైతన్య మూవీ బంగార్రాజు లో కీలకమైన నాగలక్ష్మిగా మారింది. ఒక ఊరి ప్రెసిడెంట్ గా సినిమా మొత్తం కృతి శెట్టి పాత్ర చుట్టూ తిరిగేలా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథ అల్లాడు. ఆ సినిమా కూడా ఫ్యామిలీ హిట్ అవడంతో కృతి శెట్టి వరస విజయాలతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.
అంతేకాదు కృతి శెట్టి సినిమా సక్సెస్ లు చూసిన దర్శకనిర్మాతలు ప్రతి యంగ్ హీరో సరసన ఛాన్స్ లు ఇచ్చేసారు. రామ్ ది వారియర్ తో తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రామ్ తో చేసిన వారియర్ మూవీకి యావరేజ్ టాక్ పడింది. ఈ సినిమాలో కృతి శెట్టి విజిల్ మహాలక్ష్మిలా మోడ్రెన్ గా కనిపించింది. కానీ కృతి శెట్టి పాత్రకి లింగుసామి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రామ్ తో కృతి శెట్టి లవ్ ట్రాక్ కూడా తేలిపోయింది. రామ్ తో డాన్స్ ల విషయంలో కృతి శెట్టి తేలిపోయింది అనే విమర్శలు క్రిటిక్స్ నుండి వినిపిస్తున్నాయి. చూడడానికి అందంగా ఉన్నా.. ఆమె పాత్ర వారియర్ ని ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది అంటున్నారు. వరస సక్సెస్ లతో చెలరేగిపోయిన కృతికి వారియర్ బ్రేకులు వేసింది. ఇక వచ్చే నెలలో కృతి శెట్టి నితిన్ తో కలిసి నటించిన మాచర్ల నియోజక వర్గం రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి ఆ సినిమాతో అమ్మడుకి హిట్ కొడుతుందేమో చూడాలి.