Advertisementt

సుష్మిత సేన్ తో డేటింగ్: లలిత్ మోడీ

Thu 14th Jul 2022 10:45 PM
lalit modi,sushmita sen,sushmita sen dating lalit modi  సుష్మిత సేన్ తో డేటింగ్: లలిత్ మోడీ
Sushmita Sen dating Lalit Modi సుష్మిత సేన్ తో డేటింగ్: లలిత్ మోడీ
Advertisement
Ads by CJ

ఇండియాలో టాప్ బిజినెస్ మ్యాన్ అయిన లలిత్ మోడీ అంటే తెలికియని వారెవరూ ఉండరు. ఐపీఎల్ లలిత్ మోడీ హయాంలోనే స్టార్ట్ అయ్యింది. అయితే కొన్నాళ్లుగా లలిత్ మోడీ పేరు మీడియాలో అంతగా హైలెట్ అవడం లేదు. కానీ తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుష్మిత సేన్ తో డేటింగ్ అంటూ ఒక్కసారిగా లలిత్ మోడీ వార్తల్లోకి వచ్చేసారు. ఈమధ్యన తనకి పెళ్లి అచ్చిరాదని, మూడుసార్లు పెళ్లి జరగకుండా దేవుడే కాపాడాడంటూ వేదాంతం మాట్లాడిన సుష్మిత సేన్.. రీసెంట్ గానే తనకన్నా చిన్నవాడితో డేటింగ్ కూడా చేసింది. 

ఆ డేటింగ్ పెళ్లి వరకు వచ్చి బ్రేక్ అవ్వగా.. ఇప్పుడు లలిత్ మోడీ తో సుష్మిత సేన్ డేటింగ్ విషయాన్ని ఈ జంట అఫీషియల్ గా ప్రకటించింది. ఈమధ్యనే లండన్, మాల్దీవ్స్ కి గ్లోబల్ టూర్ కి వెళ్ళివచ్చినట్లుగా తెలియజేసారు. బెటర్ పార్టనర్ సుష్మిత సేన్ అని, న్యూ లైఫ్ బిగినింగ్ అంటూ లలిత్ మోడీ చేసిన ట్వీట్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లలిత్ మోడీ వయసు 58 సంవత్సరాలు, ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం సుష్మిత సేన్ - లలిత్ మోడీ డేటింగ్ విషయాలే చక్కర్లు కొడుతున్నాయి.

Sushmita Sen dating Lalit Modi:

My better half, partner: Lalit Modi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ