Advertisementt

అల్లు అర్జున్ - హరీష్ కాంబో రిపీట్

Thu 14th Jul 2022 09:41 PM
allu arjun,harish shankar,ad shoot,allu arjun-harish shankar combo  అల్లు అర్జున్ - హరీష్ కాంబో రిపీట్
Allu Arjun-Harish Shankar join hands అల్లు అర్జున్ - హరీష్ కాంబో రిపీట్
Advertisement
Ads by CJ

యంగ్ హీరో అల్లు అర్జున్ మరోసారి హరీష్ శంకర్ తో జత కట్టబోతున్నాడు. గతంలో హరీష్ శంకర్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన డీజే(దువ్వాడ జగన్నాధం) అల్లు అర్జున్ కి మంచి హిట్ ఇచ్చింది. మాస్ గా, కూల్ గా అల్లు అర్జున్ డీజే వాయించేసాడు. ఇప్పుడు ఆ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి రిపీట్ కానుంది. అంటే అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత చెయ్యబోయే సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. దసరా టైం కి అల్లు అర్జున్ నుండి కొత్త సినిమా ప్రకటన రాబోతున్నట్టుగా గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాస్ చెప్పడంతో.. ఆ కాంబో ఏమై ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. 

ఇప్పుడు కూడా అల్లు అర్జున్ పుష్ప ద రూల్ తర్వాత హరీష్ తో సినిమా చెయ్యబోతున్నాడు అనుకునేరు.. హరీష్ కి కూడా పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ కమిట్మెంట్ ఉంది. ప్రస్తుతం హరీష్ శంకర్ తో అల్లు అర్జున్ జస్ట్ ఓ యాడ్ షూట్ చేస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ కమర్షియల్ యాడ్ లో నటించబోతున్నారు. హరీష్ తో అల్లు అర్జున్ ఫ్లైట్ లో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న పిక్ తో ఈ యాడ్ విషయాన్ని తెలియజేసారు. అల్లు అర్జున్ - హరీష్ కలిసి ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Allu Arjun-Harish Shankar join hands :

Allu Arjun-Harish Shankar join hands for an AD Shoot 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ