యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ కి ఈ రోజు మధ్యాన్నాం NTR30 అప్ డేట్ సోషల్ మీడియాలో కనిపించేసరికి వారు చాలా ఉత్సాహంతో ఊగిపోయారు. కారణం NTR30 షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలు కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో అప్ డేట్ చూసేసరికి సంబరపడ్డారు. మే నుండి ఎన్టీఆర్ - కొరటాల కలయికలో మొదలు కాబోయే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ఆనందం అంతలోనే ఆవిరైంది. కారణం దర్శకుడు కొరటాలే. అంటే ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య నష్టాల టెన్షన్ లో ఉన్నారు. ఆయన రీసెంట్ మూవీ ఆచార్య భారీ డిసాస్టర్ అవడంతో డిస్టిబ్యూటర్స్ కొరటాల పీకలమీద కూర్చున్నారు.
తాజాగా ఆచార్య తో నష్టపోయిన బయ్యర్లు కొరటాల ఆఫీస్ ముందు ధర్నా చెయ్యడంతో కొరటాల శివ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. కొంతమంది సపోర్ట్ చేస్తుంటే, కొంతమంది తిడుతున్నారు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ లో గుబులు మొదలయ్యింది. ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాక డైరెక్టర్ కొరటాలతో మూవీ మొదలు పెడదామనుకుంటే ఇదేం అపశకునం, ఇలాంటి విషయాలు జరిగితే సినిమా మీద హైప్ ఎలా వస్తుంది. అసలే పాన్ ఇండియా మూవీ, సినిమా మొదలు అయ్యే ముందు డైరెక్టర్ పై సోషల్ మీడియాలో ఇంత నెగిటివిటీ అంటే కష్టం.. ఎన్టీఆర్ అలోచించి అడుగు వెయ్యి అంటూ వాళ్ళు ఆందోళనలో పడుతున్నారు.