సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కి ఆచార్య సినిమా గుదిబండలా తయారయ్యింది. కొరటాల శివ ఫ్రెండ్స్ - రామ్ చరణ్ కలిసి నిర్మించిన ఈ సినిమా కి వచ్చిన టాక్ ఆ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. భారీ అంచనాలు భారీ అంచనాలు అంటూ ఆచార్యని బయ్యర్లు భారీ ధరలకు కొనేశారు. కానీ రిలీజ్ అయ్యే టైం కే సినిమాపై అంచనాలు లేకుండా పోయాయి. రిలీజ్ అయ్యాక ఆ సినిమాకి నెగెటివ్ టాక్ పడిపోయింది మెగా ఫాన్స్ కి కూడా సినిమా నచ్చలేదు. దానితో సినిమాని భారీ డీల్స్ కి చేజిక్కించుకున్న బయ్యర్లు చేతులెత్తేశారు. ఆ మధ్యన ఆచార్య డిస్ట్రిబ్యూటర్స్ కి చరణ్ - కొరటాల సెటిల్మెంట్ అంటూ వార్తలొచ్చాయి.
మధ్యలో ఏమైందో ఏమో.. ప్రస్తుతం కొరటాల ఆఫీస్ ముందు ఆచార్య డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు 25 మంది నిన్న రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు, ఆచార్య సినిమాని తాము 15 కోట్ల వరకూ కొని భారీగా నష్టపోయామని, ఆ లోటులో ఎంతో కొంత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొరటాల సమస్యని పరిష్కరించకపోతే చిరంజీవి ఇంటి దగ్గర ధర్నా చేస్తామని వారు కొరటాల ని హెచ్చరించారని తెలుస్తుంది. మరి ఈ విషయంలో కొరటాల ఎలా స్పందిస్తారో చూడాలి.