ప్రస్తుతం తెలంగాణాని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పలు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు పొంగి పొర్లు తున్నాయి. గోదావరి నీటి మట్టం తీర ప్రాంత ప్రజలని భయభ్రాంతులు కు గురి చేస్తుంది. అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవలు ప్రకటించారు. ఇప్పటికే సోమవారం నుండి బుధవారం వరకు సెలవలు ఇచ్చారు. ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో మరోమూడు రోజుల తోపాటు తెలంగాణాలో స్కూల్స్ కి సెలవులను పొడిగించారు. ఈ గురువారం నుండి శనివారం వరకు ఎలాంటి విద్యా సంస్థలు తెరవ కూడదు అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మరి ఈ మూడు రోజుల సెలవలు రామ్ వారియర్ కి ఎమన్నా హెల్ప్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే రేపు గురువారం రామ్ లేటెస్ట్ మూవీ ద వారియర్ రిలీజ్ కాబోతుంది. భారీ వర్షాల కారణంగా సినిమాని వాయిదా వేస్తారేమో అనుకుంటే.. రామ్ అండ్ మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గేది లేదు.. సినిమా రిలీజ్ పక్కా అంటున్నారు. మరి తెలంగాణ వ్యాప్తంగా మూడురోజు పాఠశాలలకు సెలవలు ప్రకటించిన వేళ రామ్ కి ఈ సెలవలు ఎమన్నా ఉపయోగపడతాయో.. లేదో అనేది చూడాలి. ఎందుకంటే శుక్రవారం కాకుండా రామ్ గురువారమే సినిమాని రిలీజ్ చేస్తూ ఈ వీకెండ్ పై ఫోకస్ పెట్టాడు కాబట్టి.