Advertisementt

NTR30: క్లారిటీ వచ్చేసింది

Wed 13th Jul 2022 02:35 PM
ntr30,ntr,koratala shiva  NTR30: క్లారిటీ వచ్చేసింది
NTR30 shoot from September 2022! NTR30: క్లారిటీ వచ్చేసింది
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల మూవీ జూన్ లోనే మొదలు కావాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆ సినిమా ముచ్చట వినిపించకుండా టీం సైలెంట్ గా ఉంటుంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం వెయిట్ తగ్గే ప్రాసెస్ లో జిమ్ లో బిజీగా గడుపుతున్నారు. ట్రిపుల్ ఆర్ వెయిట్ కి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 10 కిలోల బరువు తగ్గాల్సి ఉందట. అందుకే ఎన్టీఆర్ ఆ బిజీలో ఉండగా.. కొరటాల మాత్రం కామ్ గా ఉన్నారు. ఆయనేదో ఆచార్య ప్రోబ్లెంస్ లో కొట్టుమిట్టాడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా NTR30 లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండటంతో NTR30 సెట్స్ మీదకి వెళ్లడం లేట్ అవుతుంది అంటున్నారు.

ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం NTR30 అప్ డేట్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం NTR30 పూజా కార్యక్రమాలు ఆగష్టు లో జరిపి, ఈ సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ ఇప్పటికే NTR30 స్క్రిప్ట్ లాక్ చేసి, హీరోయిన్ వేటలో ఉన్నారని తెలుస్తుంది. సెప్టెంబర్ కల్లా నటుల ఎంపిక తో పాటుగా మిగతా విషయాలను చక్కబెట్టి కూల్ గా NTR30 ని పట్టాలెక్కిస్తారని తెలుస్తుంది. 

NTR30 shoot from September 2022!:

NTR30 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ