Advertisementt

రియానే సుశాంత్ డ్రగ్స్ కి బానిసయ్యేలా చేసింది

Wed 13th Jul 2022 12:22 PM
rhea chakraborty,sushant singh rajput,drug addiction,ncb  రియానే సుశాంత్ డ్రగ్స్ కి బానిసయ్యేలా చేసింది
NCB charges Rhea Chakraborty with abetting Sushant Singh రియానే సుశాంత్ డ్రగ్స్ కి బానిసయ్యేలా చేసింది
Advertisement
Ads by CJ

2020 లో తన సొంత ఫ్లాట్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ కేసు చివరికి డ్రగ్స్ కేసుగా గా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ మరణానికి కారణం ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తో పాటుగా ఆమె తమ్మడు షోవిక్ కారణమంటూ.. రియా చక్రవర్తే డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్ సింగ్ కి ఇచ్చింది అని ఆమెపై కేసు నమోదు కావడమే కాదు, ఈ డ్రగ్స్ వ్యవహారంలో కొన్నాళ్ళు ఆమె జైలు లో కూడా ఉంది. తర్వాత బెయిల్ పై బయటికి వచ్చి మళ్ళీ షూటింగ్స్ లో బిజీ అయ్యింది. 

అయితే తాజాగా రియా చక్రవర్తి కావాలనే సుశాంత్ రాజ్ ఫుట్ కి డ్రగ్స్ కి అలవాటు చేసింది అని, సుశాంత్ సింగ్ వ్యసనానికి బానిసయ్యేందుకు రియా చక్రవర్తి సహకరించినట్లు ఆమెపై ఎన్సీబీ అభియోగాలు మోపింది. శామ్యూల్ మిరాండా, షోవిక్ చరోబర్తీ, దీపేష్ సావంత్ నుండి రియా చక్రవర్తి డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్ కి ఇచ్చింది అని, ఈ డ్రగ్స్ కొనుగోలు విషయంలో 2020 మార్చి నుండి సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత సెప్టెంబర్ వరకు ఆమె షోవిక్ కు డబ్బులు చెల్లించింది అంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అభియోగాలు మోపడంతో రియా చక్రవర్తి కి ఈ కేసు మరింత ఝటిలంగా మారింది.

ఇక కోర్టులో గనక రియా పై ఎన్‌సీబీ చార్జిషీట్‌లో చేసిన అభియోగాలు రుజువైతే మాదక ద్రవ్వాల నిరోధక చట్టం కింద రియాకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు.

NCB charges Rhea Chakraborty with abetting Sushant Singh:

Rhea Chakraborty charged for abetting Sushant Singh Rajput extreme drug addiction

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ