Advertisementt

రూమర్స్‌కు చెక్.. ‘పుష్ప 2’ రిలీజ్ అప్పుడే!

Sat 16th Jul 2022 12:11 PM
allu arjun,pushpa 2,release details,bunny,sukumar,allu arjun pushpa 2,mythri movie makers,icon star,sukumar pushpa,pushpa movie  రూమర్స్‌కు చెక్.. ‘పుష్ప 2’ రిలీజ్ అప్పుడే!
Allu Arjun Pushpa 2 Movie Latest Update రూమర్స్‌కు చెక్.. ‘పుష్ప 2’ రిలీజ్ అప్పుడే!
Advertisement
Ads by CJ

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం ‘పుష్ప’. అంత భారీ విజయం తర్వాత కూడా ఈ చిత్రయూనిట్ ఇంకా కన్ఫ్యూజ్‌లోనే ఉండటం టాలీవుడ్‌ని ఆశ్చర్యపరుస్తుంది. సీక్వెల్‌కు సంబంధించి షూటింగ్ ఎప్పుడో మొదలవ్వ వలసి ఉంది. కానీ యూనిట్ ఇంకా మీనమేషాలు లెక్కపెడుతోంది. దీంతో ఈ సినిమాపై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం.. సీక్వెల్‌కి సంబంధించిన కథని పకడ్బందీగా లాక్ చేసి పెట్టారని మాత్రం తాజాగా బయటికి వచ్చింది. అలాగే షూటింగ్ ఎప్పుడు మొదలైనా.. చిత్రాన్ని మాత్రం వచ్చే వేసవికి విడుదల చేయాలనేలా.. లెక్కల మాస్టారు పక్కాగా స్కెచ్ రెడీ చేశారని తెలుస్తుంది. ఒక్కసారి సెట్‌పైకి వెళితే.. ఎలా షూటింగ్ ఫినిష్ చేయాలనేది.. అంతా ప్రణాళికాబద్ధంగా సుకుమార్ రెడీ చేసి ఉంచారట. అందుకే సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలైనా.. విడుదల మాత్రం ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వేసవికి ఉంటుందని నిర్మాతలు చాలా స్ట్రాంగ్‌గా చెబుతున్నారు. 

 

ఇక ఈ సీక్వెల్‌కి సంబంధించి మరికొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. సీక్వెల్‌లో సరికొత్త పాత్రలు పరిచయం అవుతాయని, బడ్జెట్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్‌లో ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ కూడా క్లోజ్ అయినట్లుగా టాక్ నడుస్తుంది. సో.. ఎటు చూసినా.. ఈ సినిమా ‘తగ్గేదే లే’ అనే సంకేతాలనే అందిస్తున్నప్పటికీ.. షూటింగే ఎప్పుడు మొదలవుతుందో యూనిట్ మాత్రం చెప్పలేకపోతుంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘పుష్ప 2’ సీక్వెల్ షూటింగ్ ఆగస్ట్‌లో ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అలాగే ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి కూడా సుకుమార్ ఈసారి వెరైటీగా ప్లాన్ చేసినట్లుగా టాక్ నడుస్తుంది. వన్స్.. షూటింగ్ స్టార్ట్ అయితే చాలు.. అప్‌డేట్స్‌తో అల్లాడించడానికి టీమ్ సిద్ధంగా ఉందనేది మాత్రం వాస్తవం. మరి ఆ అప్‌డేట్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. 

Allu Arjun Pushpa 2 Movie Latest Update:

Pushpa 2 Movie Release Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ