Advertisementt

హీరో నిఖిల్ సారీ చెప్పేశాడు

Sat 16th Jul 2022 10:44 AM
nikhil,sorry,karthikeya 2,release,postponed,anuapama parameswaran,hero nikhil siddharth,nikhil karthikeya 2  హీరో నిఖిల్ సారీ చెప్పేశాడు
Young Hero Nikhil says sorry to Audience హీరో నిఖిల్ సారీ చెప్పేశాడు
Advertisement
Ads by CJ

తన తదుపరి సినిమా రిలీజ్ విషయంలో.. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సారీ చెప్పేశాడు. చెప్పిన టైమ్‌కి సినిమా విడుదల కావడం లేదని తెలుపుతూ.. ఇప్పటికే ప్రీమియర్ షోస్ కోసం టికెట్స్ బుక్ చేసుకున్న వారికి.. ఆ డబ్బు తిరిగి రిటన్ చేయబడుతుందని.. సోషల్ మీడియా వేదికగా నిఖిల్ పోస్ట్ చేశాడు. ఆయన హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. గతంలో నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించి, ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. 

 

కానీ సడెన్‌గా ఈ సినిమా ఆ తేదీకి విడుదల కావడం లేదంటూ.. నిఖిల్ బాంబ్ పేల్చారు. ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్ చేసిన 25 నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడయినట్లుగా వచ్చిన ఓ ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ.. నిఖిల్ సారీ చెప్పారు. ‘‘ఈ సినిమా జూలై 22న విడుదల కావడం లేదు. ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో విడుదలవుతుంది. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న ప్రేక్షకులంతా క్షమించాలి. ప్రీమియర్ షోకి బుక్ చేసుకున్న వారి మనీ రిటన్ చేయబడుతుంది..’’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. దీంతో నిఖిల్ అభిమానులంతా మరోసారి నిరాశకు లోనవుతున్నారు. 

 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్ సరసన ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోన్న ఈ చిత్రంలో.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్న సమయంలో.. నిఖిల్ ఇలా విడుదలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. 

Young Hero Nikhil says sorry to Audience:

Nikhil pushes Karthikeya 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ