Advertisementt

తన హెల్త్ న్యూస్ లపై విక్రమ్ ఫన్నీ రియాక్షన్

Tue 12th Jul 2022 11:44 AM
chiyaan vikram,cobra movie,heart attack,vikram,chennai,kaveri hospital  తన హెల్త్ న్యూస్ లపై విక్రమ్ ఫన్నీ రియాక్షన్
Chiyaan Vikram Is Back and Looks Healthy తన హెల్త్ న్యూస్ లపై విక్రమ్ ఫన్నీ రియాక్షన్
Advertisement
Ads by CJ

చియాన్ విక్రమ్ నాలుగు రోజుల క్రితం ఛాతి నొప్పితో చెన్నై కావేరి ఆసుపత్రి లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఆయన అలా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారో, లేదో.. ఇలా  సోషల్ మీడియా అంతా విక్రమ్ హెల్త్ పై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చేసాయి. దానితో ఆయన ఫాన్స్ విపరీతంగా ఆందోళన పడ్డారు. ఆఖరికి విక్రమ్ కి ఏం కాలేదు అని కావేరి ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటల్ విడుదల చేసినా ఆ న్యూస్ లకు అడ్డుకట్ట పడలేదు. చివరికి విక్రమ్ కొడుకు హీరో ధృవ్ తన తండ్రి విక్రమ్ ఆరోగ్యం బాగానే ఉంది అని, ఎలాంటి పుకార్లు పుట్టించొద్దు అంటూ విజ్ఞప్తి చేసేవరకు ఆ వార్తలు ఆగలేదు. 

తర్వాత రెండు రోజులకి విక్రమ్ ఆసుపత్రి నుండి డిశ్ ఛార్జ్ అయ్యి తన హెల్త్ కండిషన్ పై ఓ వీడియో రిలీజ్ చేసినట్లుగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా విక్రమ్ పూర్తి ఆరోగ్యంతో ఆయన నటించిన కోబ్రా ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపించారు. ఆ ఈవెంట్ లో తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం పై ఆయన కాస్త ఫన్నీగా, ఘాటుగానే స్పందించారు. నా హెల్త్ విషయంలో సోషల్ మీడియాలో ఏవేవో వార్తలు రాసారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏకంగా వేరే పేషేంట్ బాడీకి నా ఫేస్ పెట్టి మరీ క్రియేటివిటీ చూపించారు. కానీ నేను చాలా హెల్దీగా ఈ రోజు మీ మధ్యన నిలబడి ఉన్నాను అంటూ విక్రమ్ తనపై తన ఆరోగ్యంపై వచ్చిన రూమర్స్ పై స్పందించారు. తన ఆరోగ్యం పై ఎలాంటి ఆందోళ పడవద్దు అంటూ ఫాన్స్ కి సున్నితంగా చెప్పారు.

Chiyaan Vikram Is Back and Looks Healthy:

Chiyaan Vikram reacts to rumours of heart attack

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ